Amaravathi : అమరావతి పాదయాత్రకి ఇదే అతిపెద్ద అగ్ని పరీక్ష…. !
Amaravathi : ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని.. అది అమరావతి.. అంటూ అమరావతినే రాజధానిగా చేయాలని ఏపీలో రైతులు మహా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రను అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా చేపడుతున్నారు రైతులు. అయితే.. తాజాగా మహా పాదయాత్ర ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలను దాటేసి ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర ఒక ఎత్తు అయితే..
ఇప్పుడు జరగబోయే యాత్ర మరో ఎత్తు. ఎందుకంటే.. ఇప్పుడే ఈ యాత్ర గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించడంతో అసలు పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నిజానికి.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు తగల్లేదు. కానీ.. ఈ జిల్లాల్లోనే అసలు పరీక్ష. అలాగే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లేంత వరకు రైతులకు ఎన్ని ఆటంకాలు ఎదురు కానున్నాయో. నిజానికి.. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రలో ఇప్పటి వరకు ఎటువంటి అడ్డంకులు రాలేదు కానీ.. కృష్ణా జిల్లా గుడివాడలో మాత్రం కాస్త ఉద్రిక్తంగానే మారిందని చెప్పుకోవాలి.
Amaravathi : కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తంగా మారిన పాదయాత్ర
అమరావతి ఉద్యమాన్ని చాలాసార్లు చులకన చేస్తూ మాట్లాడిన కొడాలి నాని నియోజకవర్గంలో రైతులు తమ సత్తా చాటాలని అనుకున్నారు. అందుకే అమరావతి రైతులు గుడివాడలో నానిపై సవాల్ విసిరారు. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రస్తుతం రైతులు ప్రవేశించారు. ఇక్కడ యాత్రపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో ఉత్తరాంధ్రలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. అప్పుడు ఇంకెంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో. నిజానికి ఈ యాత్రకు టీడీపీ, జనసేన నుంచి మద్దతు లభిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన కాస్త బలంగానే ఉన్నాయి. అందుకే అక్కడ రైతులకు మద్దతు ఇస్తూ గోదావరి జిల్లాల ప్రజల ఆదరాభిమానాలు చురగొనాలని టీడీపీ, జనసేన పార్టీలు భావిస్తున్నాయి. చూద్దాం మరి భవిష్యత్తులో ఈ యాత్రలో ఇంకెన్ని అడ్డంకులు వస్తాయో?