Corona : ప్ర‌పంచానికి గుడ్ న్యూస్‌ చెప్పిన అమెరికా.. ఈ ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే కరోనా మటాష్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Corona : ప్ర‌పంచానికి గుడ్ న్యూస్‌ చెప్పిన అమెరికా.. ఈ ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే కరోనా మటాష్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :24 April 2021,10:11 pm

Corona Second Wave : ప్రస్తుతం కరోనాతో దేశమంతా అల్లాడిపోతోంది. మరోసారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలంతా కరోనా రక్కసితో భయపడిపోతున్నారు. ఎక్కడ చూసినా కరోనా గురించే చర్చ. కరోనా మరోసారి కొత్త రూపంలో వచ్చి దేశ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఒకటి కాదు… రెండు కాదు… లక్షలకు లక్షలు కేసులు రోజూ నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే… ఇప్పటికే ఇండియాలో వ్యాక్సిన్ ఉన్నా… రోజూ లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నా… ఫలితం ఉండటం లేదు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు కూడా కరోనా బారిన పడుతుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో జనాలు ఉన్నారు. అందుకే… కొత్త వ్యాక్సిన్లకు కూడా ప్రభుత్వం అనుమతిని ఇస్తోంది. అయినా కూడా ప్రజల్లో భయం మాత్రం తగ్గలేదు. కరోనా వ్యాక్సిన్ ఉంది కదా… అనే ధైర్యం మాత్రం జనాల్లో అస్సలు లేదు. ఈ వ్యాక్సిన్ గట్రా కాకుండా… ఏదైనా కరోనా వైరస్ ను చంపే మందు కోసం జనాలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

america researchers discovers corona tablet molnupiravir

america researchers discovers corona tablet molnupiravir

అటువంటి వాళ్ల కోసం వచ్చిందే కరోనా ట్యాబ్లెట్. అవును… కరోనా వైరస్ ను 24 గంటల్లో చంపేసే ట్యాబ్లెట్ ఇది. దీనిపేరు మోల్నుపిరావిర్. దీన్ని అమెరికాలోని జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు తయారు చేశారు. ఈ ట్యాబ్లెట్ కరోనా వైరస్ ను 24 గంటల్లో చంపేస్తుందని వాళ్లు ప్రకటించారు. కరోనా వైరస్ ను చంపేందుకు తయారైన మొట్టమొదటి ట్యాబ్లెట్ ఇది. అయితే… ఇది కరోనా వైరస్ ను అంతం చేయడానికి తయారు చేసిన ట్యాబ్లెట్ కాదు. దీన్ని వేరే వైరస్ లను చంపేందుకు తయారు చేశారు.

Corona Second Wave : కరోనాలో ఉండే ఆర్ఎన్ఏ వైరస్ ను చంపే సత్తా ఉన్న ట్యాబ్లెట్ ఇది

సాధారణంగా వైరస్ లు పుట్టుకొస్తుంటాయి కదా. యూఎస్ లో ఎక్కువగా వ్యాప్తి చెందే మెర్స్, సార్స్ అనే ఇన్ ఫ్లూయెంజా వైరస్ లను చంపడం కోసం తయారు చేసినా… ఈ ట్యాబ్లెట్ కరోనా వైరస్ కు కూడా బాగా పనిచేస్తోందట. పరిశోధనలో ఈ విషయం తేలడంతో… రీసెర్చర్స్ ఆనందానికి అవదులు లేవు. కరోనా వైరస్ తో పాటు… శరీరంలోకి వెళ్లాక… శ్వాసను ఇబ్బందికి గురిచేసే ఆర్ఎన్ఏ వైరస్ కూడా ఈ ట్యాబ్లెట్ ఒక్క దెబ్బతో చంపేస్తుందట. ఈ ట్యాబ్లెట్ ను కొన్ని జంతువుల మీద ప్రయోగాలు చేయగా… ఆ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ఫెర్రెట్ అనే జంతువుల మీద క్లీనికల్ ట్రయల్స్ చేశారు.

ప్రస్తుతం భారత మార్కెట్ లో రెమ్ డెసివిర్ అనే ఇంజెక్షన్ దొరుకుతోంది. కానీ… ఇది వైరస్ ముదరకముందే… అంటే కరోనా వైరస్ సోకాక… ఆ వైరస్ తీవ్రత పెరగకముందే ఇవ్వాల్సి ఉంటుంది. వైరస్ తీవ్రత పెరిగాక ఇస్తే ప్రయోజనం ఉండదు. కానీ… ఈ ట్యాబెట్ మాత్రం.. కరోనా వైరస్ తీవ్రత పెరిగినా కూడా ఇవ్వొచ్చు. వైరస్ శరీరంలో ఎంత ముదిరినా…. ఈ ట్యాబ్లెట్ ఇస్తే… దెబ్బకు వైరస్ 24 గంటల్లో చనిపోతుంది. అయితే… ఇంకా ఈ ట్యాబ్లెట్ కు సంబంధించిన పూర్తి ట్రయల్స్ అవలేదు. అవి పూర్తవగానే… ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఈ ట్యాబ్లెట్ తాలూకు రిపోర్ట్ లను పంపిస్తే… WHO గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ట్యాబ్లెట్ అందరికీ అందుబాటులోకి రానుంది.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది