Amit Shah : కలిసి వెళ్లిన 24 గంటలకే ఎన్టీఆర్‌కి షాక్ ఇచ్చిన అమిత్ షా..!
Amit Shah : మునుగోడు ఉపఎన్నిక కోసం ఏర్పాటుచేసిన సభలో పాల్గొనేందుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా నిన్న సాయంత్రం తెలంగాణకు విచ్చేసిన విషయం తెలిసిందే. మునుగోడు సభలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న చేస్తున్న అరాచాలను ఆయన ఊటంకించారు. దాని కంటే ముందు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించిన అమిత్ షా.. రైతుల కోసం ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు.
Amit Shah : ఎన్టీఆర్ చేతులు కట్టుకోవడం తప్పా..
మునుగోడు మీటింగ్ అనంతరం అమిత్ షా ఈనాడు అధినేత రామోజీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు.ప్రస్తుతం దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్‌ను పాలిటిక్స్ లోకి రావాలని అమిత్ షా కోరారా? అని చాలా మంది ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం అమిత్ షా ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా చూశారని అందులో ఎన్టీఆర్ నటనకు షా ఫిదా అయ్యారని అందుకే మర్యాద పూర్వకంగా కలిశారని చెప్పుకొస్తున్నారు. అసలు మీటింగ్ వెనుకున్న అంతర్యం ఎవరికీ తెలీదు. అటు కమలదళం నేతలు చెప్పడంలేదు. ఇటు ఎన్టీఆర్ కూడా ఎక్కడా రివీల్ చేయలేదు.కేవలం ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చ జరిగినట్టు కొందరు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక పత్రికల వాళ్లు తమకు నచ్చిన రీతిలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏది పడితే అది ఊహించుకుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇదిలాఉండగా, ఎన్టీఆర్ అమిత్ షా ముందు చేతులు కట్టుకుని కూర్చోవడంపై ప్రస్తుతం చర్చ మొదలైంది. అమిత్ షా ఎన్టీఆర్ ను అవమానించారని కొందరు అంటున్నారు. మొన్నటికి మొన్న చిరంజీవి జగన్‌కు కలిస్తే మా అన్నను అవమానించారని అటు నాగబాబు, ఇటు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిన ఎన్టీఆర్ అమిత్ షా ముందు చేతులు కట్టుకుని పెద్దవాళ్లకు మర్యాద ఇచ్చాడని భావించకుండా దీనిపై పెద్ద చర్చ లేవనెత్తడంతో సోషల్ మీడియాలో హంగామా పెరిగిపోయింది.