Anchor Vishnu priya : అది ఎంతో కష్టంగా అనిపించింది.. యాంకర్ విష్ణుప్రియ
Anchor Vishnu priya యాంకర్ విష్ణుప్రియ అంటే ఇప్పుడు తెలియని వారెవ్వరూ ఉండరు. బుల్లితెరపై విష్ణుప్రియ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అయితే ఇప్పుడు వాటన్నింటికి దూరంగా ఉంటోంది. షూటింగ్‌లంటూ బిజీగా ఉండకుండా.. తన లైఫ్ స్టైల్‌ను మార్చుకుంది. దైవచింతన, సేవా కార్యక్రమాల్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తోంది. రుద్ర ఫౌండేషన్‌ను విష్ణుప్రియ నడిపిస్తోంది. చేతనైన సాయాన్ని చేస్తూ అందరికీ అండగా నిలుస్తోంది.పాతికేళ్లకు ఎంత సంపాదించాలో అంతకంటే ఎక్కువే సంపాదించాను.

Anchor Vishnupriya Boxing Training Session
. ఇకపై కొన్ని రోజులు గ్యాప్ ఇద్దామని అనుకున్నానంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఇలా దైవాన్వేషణలో మునిగానని, ప్రశాంతత కోసం వెదుకుతన్నానని చెప్పుకొచ్చింది. అలా ఆ మధ్య అందుకే షూటింగ్‌లకు హాజరు కాలేదని చెప్పింది. అయితే ఇప్పుడు మళ్లీ విష్ణుప్రియ బిజీగా మారింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ప్రతీ ఆదివారం మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తోంది.అంతే కాకుండా ప్రతీ రోజూ జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తోంది. ఆ వర్కవుట్లను చూస్తే ఏదో యాక్షన్ సినిమాకు ముందే ప్రిపేర్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
Anchor Vishnu priya బాక్సింగ్‌తో విష్ణుప్రియ హల్చల్

Anchor Vishnupriya Boxing Training Session
జంపింగ్‌లు, బాక్సింగ్‌లు నేర్చుకుంటోంది. అలా విష్ణుప్రియ ఇప్పుడు క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. గురువారం రోజు విష్ణుప్రియ బాక్సింగ్ సెషన్‌లో బిజీగా ఉందట. ఈ మేరకు తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. ఈ గురువారం మీకు ఎలా గడిచింది? నేను మాత్రం ఈ రోజు పంచ్‌లతో గడిపాను.. అది చాలా ఎంతో కష్టంగా గడిచింది. కానీ నాకు ఎంతో సంతోషంగా అనిపించిందంటూ చెప్పుకొచ్చింది.