Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో ప్రీ ఫైనల్ ఎలక్షన్స్ !
Andhra Pradesh : ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ వచ్చేసింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికల పోరు స్టార్ట్ అయింది. ఇంకో రెండు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ.. ఒక అసెంబ్లీ ఎన్నికలకు ఎంత హడావుడి ఉంటుందో అంత హడావుడి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంత ఉంది. రెండు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఏపీకి ఒక ప్రీ ఫైనల్ అని అనుకోవాలి.
ఈ ఎన్నికల్లో వచ్చే రిజల్టే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశం ఉన్నందున ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.అధికార వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవాలని బాగానే వ్యూహాలు రచిస్తోంది. ఇక.. టీడీపీ కూడా ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఒకవేళ టీడీపీ, వామపక్షాల పొత్తులో ఈ ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ వస్తే.. వచ్చే ఎన్నికల్లో అదే పొత్తును టీడీపీ కంటిన్యూ చేయనుంది.
Andhra Pradesh : అధికార వైసీపీ ప్లాన్ ఏంటి?
అధికార వైసీపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. రెండోసారి కూడా అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. ఏదో గెలవడం కాదు.. ఏకంగా 175 స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ప్రీ ఫైనల్ అయ్యాయి. మరి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు. ఎవరికి మెజారిటీ వస్తుంది. ఎవరు ప్రీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ కు చేరుకుంటారు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.