Turkey: ఈరోజు టర్కీకి మరో భారీ ముప్పు..భారీ భూకంపం.. మళ్లీ ఆయనే చెప్పాడు..?
Turkey: ప్రపంచవ్యాప్తంగా రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో చైనా స్పై బెలూన్ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించటం తెలిసిందే. ఇక టర్కీ, సిరియా దేశాలలో వరుస పెట్టి భారీ భూకంపాలు భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చేకూర్చడం తెలిసిందే. ఇదిలా ఉంటే టర్కీలో భారీ ఎత్తున ప్రాణం నష్టం జరిగింది.
దాదాపు 5 వేలకు పైగానే భారీ భవనాలు కూలిపోయాయి. దీంతో వాటి కింద చాలా మంది ఇరుక్కుపోయి. ఆర్తనాదాలు పెడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే వరుస భూప్రకంపనాలతో అతలాకుతలమవుతున్న టర్కీలో మరో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందంటూ ఫ్రాంక్ హుగ్గర్ బీట్స్ పేరుతో మరో ట్వీట్ సోషల్ మీడియాలో.. రావటం జరిగింది. అంతేకాదు భూకంపా తీవ్రత రీక్టర్ స్కేలు పై 6గా ఉంటుందని తెలియజేశారు.
ఈ కామెంట్ ఇప్పుడు టర్కీ వాసులను మరింత భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. విషయంలోకి వెళ్తే అంతకుముందు టర్కీలో భారీ భూకంపం రాబోతుందని ఘటనకు నాలుగు రోజుల ముందు ఇదే ట్వెటర్ ఎకౌంట్ వేదికగా ట్వీట్ రావటం జరిగింది. భూకంపం సంభవించే కచ్చితమైన తేదీ మరియు భూకంప తీవ్రత సహా పలు వివరాలను ముందే ప్రకటించారు. కాగా ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖు కూడా భారీ భూకంపం సంభవిస్తుందని… రెక్టార్ స్కేలు పై 6 తీవ్రతతో భూకంపం రాబోతుందని కామెంట్ చేయడం సంచలనంగా మారింది.