No Discount : మీరు డిస్కౌంట్ అడగొద్దంటూ భారత్, పాక్ వాసులను ఉద్దేశిస్తూ బోర్డులు.. ఎక్కడంటే !
ప్రధానాంశాలు:
No Discount : మీరు డిస్కౌంట్ అడగొద్దంటూ భారత్, పాక్ వాసులను ఉద్దేశిస్తూ బోర్డులు.. ఎక్కడంటే !
No Discount : టర్కీలోని turkey ఓ దుకాణం వద్ద ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. దుకాణ యజమాని భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేశాడు. అందులో “ఇక్కడ భారత్, పాక్, బంగ్లా దేశాల వాసులకు డిస్కౌంట్ లేదు. దయచేసి డిస్కౌంట్ అడగొద్దు” అంటూ స్పష్టంగా రాశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

No Discount : మీరు డిస్కౌంట్ అడగొద్దంటూ భారత్, పాక్ వాసులను ఉద్దేశిస్తూ బోర్డులు.. ఎక్కడంటే !
No Discount : పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో షాపుల వద్ద ‘నో డిస్కౌంట్’ బోర్డులు దర్శనం.. ఎక్కడంటే !
ఈ ఫొటో ఇంటర్నెట్‌లో బయటపడగానే భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ చర్యను వివక్షగా అభివర్ణిస్తూ విమర్శిస్తుండగా, మరికొందరు వ్యాపార నిబద్ధత ప్రకారమే దీని వెనుక కారణాలుంటాయని అభిప్రాయపడుతున్నారు. పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారతీయుల మధ్య ఈ విషయంపై మరింత అసహనం వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు దుకాణ యజమానిపై నిందలు వేస్తుండగా, మరికొంతమంది మాత్రం “మనం డిస్కౌంట్ కోసం తక్కువ ధర పలకాలని బతిమిలాడే అలవాటును మార్చుకోవాల్సిందే” అని చర్చ ప్రారంభించారు.
ఈ చిన్న సంఘటన స్థానిక స్థాయిలో జరిగినా, అంతర్జాతీయంగా ఇది భారత్, పాక్, బంగ్లాదేశ్ పౌరులపై కొన్ని దేశాల్లో ఉన్న ముద్రను సూచిస్తోందని నిపుణులు భావిస్తున్నారు.వ్యాపార సంబంధాల్లో పరస్పర గౌరవం ఉండాలంటే ఇటువంటి వివక్షను నివారించాల్సిన అవసరం ఉంది. అయితే వ్యక్తిగత దుకాణ యజమాని నిర్ణయాన్ని అధికారిక స్థాయిలో తీసుకోవడం తప్పని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.