Ramoji Rao – YS Jagan : మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు ఇప్పటికే ఏపీ సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలుసు కదా. తాను ఇక్కడ లేను.. అమెరికాలో ఉన్నాను. వచ్చాక విచారణకు హాజరు అవుతాను అని శైలజా కిరణ్ నెత్తినోరు మొత్తుకున్నా సీఐడీ వినలేదు. ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు శైలజకు నోటీసులు జారీ చేసింది. అవి కూడా లుక్ అవుట్ నోటీసులు. అలాగే.. మార్గదర్శి ఆస్తులను కూడా సీఐడీ అటాచ్ చేసింది. ఈ కేసులో తాజాగా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవుతోంది. అంటే.. రామోజీ సామ్రాజ్యం మొత్తంపై ఈడీ కన్నేసే చాన్స్ ఉంది.
రూ.793 కోట్ల ఆస్తులను ఇప్పటికే సీఐడీ అటాచ్ చేసింది. పూల్ ఖాతాను తన ఆధీనంలోకి తీసుకుంది. ఇది కేవలం ఒక్క మార్గదర్శి కేసు మాత్రమే. ఇంకా రామోజీ గ్రూప్ లోని లూప్ హోల్స్ అన్నింటినీ వెతికి మరీ రామోజీ రావుని ఇరికించాలనే ధోరణిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ సీఐడీకి కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది. ఈ కేసులో ఎంత దూరం అయినా వెళ్లాలని చెప్పింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ హాజరు అయినప్పుడే ప్రధానితో పాటు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. అప్పుడే 2014 లో అధికారంలోకి వచ్చాక చంద్రబాబు హయాంలో ఎలాంటి అవినీతి జరిగిందో దానిపై నివేదికలు కావాలని సీఐడీ.. జగన్ ను కోరింది.
సీఐడీ నివేదిక కోరిన వెంటనే రామోజీరావు ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. అంటే.. అమిత్ షా నుంచి జగన్ కు ఫుల్ పర్మిషన్స్ వచ్చినట్టే అని అర్థం అయింది. అందుకే ఏపీ సీఐడీ వేగంగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఆ తర్వాత మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ కు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇక.. ఈ కేసులో ఈడీ కూడా వస్తే ఇక మామూలుగా ఉండదు. రామోజీరావుకు ఉన్న ఇతర వ్యాపారాలపై కూడా ఈడీ కన్నేసి అందులో ఏవైనా అవకతవకలు ఉంటే వాటిని తవ్వి తీసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.