YS Jagan : నేను క్లియర్ గానే ఉన్నాను మోదీజీ : వైఎస్ జగన్ .. ?
YS Jagan : ఒక రాష్ట్రం ముందుకెళ్లాలన్నా.. అభివృద్ధి చెందాలన్నా.. సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా.. ఇంకేం చేయాలన్నా.. ఖచ్చితంగా కేంద్రం మద్దతు అవసరం. కేంద్రం మద్దతు లేకుండా ఏం చేయలేం. అయితే.. ఒక్కోసారి కేంద్రానికి, రాష్ట్రానికి పడదు. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. కేంద్రానికి, రాష్ట్రానికి పడని సందర్భాలు చాలా ఉంటాయి. ఆ సమయంలో.. నువ్వా.. నేనా అంటూ కొట్టుకుంటూ ఉండేకంటే సామరస్యంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లడం మంచిది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం చేసేది అదే. ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం విషయంలో అలాగే ముందుకెళ్తున్నారు. ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. ఏ విషయంలోనైనా సరే. సీఎం జగన్.. క్లియర్ విజన్ తో ముందుకెళ్తున్నారు.
అయితే.. అంతే క్లియర్ విజన్ తో కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో లేదు అనేది ప్రస్తుత వాదన. ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీకి ఇవ్వాల్సిన హామీల విషయంలో కావచ్చు.. ఇంకా నిధుల విషయంలో కావచ్చు.. కరోనా సమయంలో కావాల్సిన సధుపాయాలు, వ్యాక్సిన్లు, ఇతర విషయాల్లో కావచ్చు.. ఆయన పూర్తిగా విఫలం అయ్యారు.. అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి కరోనా వ్యాక్సిన్ విషయంలో, మందుల విషయంలో అస్సలు మోదీ ప్రభుత్వం ఏపీకి సహకరించడం లేదు అనేది అందరికీ తెలిసిన వాస్తవమే.
YS Jagan : ఏపీలో కేసులు ఎక్కువగా ఉన్నా.. వ్యాక్సిన్ కు కొరతే?
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఏపీకి వ్యాక్సిన్ల సంఖ్యను కూడా పెంచాలి. కానీ.. అసలు వ్యాక్సిన్లకు ఏపీలో తీవ్రంగా కొరత ఉంది. కేంద్రాన్ని అడిగితే పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వం చెబుతోంది. నిజానికి.. వ్యాక్సిన్ల విషయంలో.. ఏర్పాట్లు అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవాలని కేంద్రం చెప్పినా.. దానికి తగిన ఏర్పాట్లు ఏపీ ప్రభుత్వం చేసుకుంటుండగానే.. వ్యాక్సిన్ ను తన అదుపులోకి తెచ్చుకుంది కేంద్రం. చివరకు ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం నుంచి ఆక్సిజన్ వస్తేనే.. లేకపోతే ఆక్సిజన్ కొరత ఏర్పడినట్టే.
మొత్తం మీద సీఎం జగన్.. ఎంత క్లియర్ గా ముందుకెళ్తున్నా.. కేంద్రం మాత్రం అడుగడుగునా.. ఏపీ ప్రభుత్వాన్ని అడ్డుకుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. కావాలని బీజేపీని సీఎం జగన్ తప్పుపడుతున్నారని.. అసలు ఏపీలో వ్యాక్సిన్ కొరత లేదు.. ఆక్సిజన్ కొరత లేదు.. కావాలని ఏపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అంటూ బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ విషయంలో కాస్త అటూ ఇటూగానే ఉన్నట్టు తెలుస్తోంది.