YS Jagan : త్వరలో మంత్రివర్గ విస్తరణ… సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి…?
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏ పని చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుంది. పరమార్థం ఉంటుంది. ఆయన ఒక్క అడుగు ముందుకు వేశారు అంటే.. ఎన్నో అడుగులు వెనక్కి వేసి ఆలోచించి.. ముందడుగు వేస్తుంటారు. ఆయన ఏ విషయంపై మాట్లాడినా.. ఏదైనా పనిచేసినా అంతే. ఆయన ప్రారంభించే పథకాలు కూడా ఎంతో మేథోమథనం చేస్తే వచ్చినవి. చిన్నవయసులోనే ముఖ్యమంత్రి అయినా కూడా ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు సీఎం జగన్.
అయితే.. వైఎస్ జగన్.. ఎక్కువగా తన పార్టీలో కానీ.. ప్రభుత్వంలో కానీ యువనేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా అంతే. ప్రస్తుతం జగన్ కేబినేట్ ఉన్న మంత్రుల్లో ఎక్కువ శాతం మంది యువకులే. కాకపోతే రాజ్యసభకు మాత్రం కొందరు సీనియర్ నేతలను పంపుతున్నారు. త్వరలో వైఎస్ జగన్ తన కేబినేట్ ను విస్తరిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలామంది సీనియర్ నేతలు రెడీ అవుతున్నారు. మొదటి కేబినేట్ విస్తరణలో చోటు దక్కని వారు కూడా ఇప్పుడు మళ్లీ చోటు దక్కుతుందని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.
YS Jagan : సీనియర్లకు ఈసారి కూడా కేబినేట్ లో చోటు దక్కదా?
సీనియర్ నేతల్లో కొందరికి మాత్రమే మొదటి కేబినేట్ లో అవకాశం కల్పించారు జగన్. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఒక్క సీనియర్ నేతకు కూడా అవకాశం ఇవ్వకుండా.. కేవలం యూత్ కే ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ యోచిస్తున్నారట. సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వకుండా.. పార్టీలోనే ఏవైనా పదవులు ఇచ్చి వాళ్లకు కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకోవాలనేది జగన్ ప్లాన్ అట.
ఎలాగైనా రెండో మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని ఎంతో ఆశతో ఉన్న సీనియర్ నేతల ఆశలపై సీఎం జగన్ మరోసారి నీళ్లు చల్లారని వార్తలు వస్తున్నాయి. అయితే.. యువ నాయకులకే జగన్ ఎక్కువ ప్రాధాన్యతను మొదటి నుంచీ ఇస్తుండటంతో.. సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. సీనియర్ నేతలు తాము కోరుకున్న పదవి దక్కనప్పుడు వాళ్లు జగన్ చెప్పినట్టు ఎందుకు నడుచుకుంటారు. వాళ్లు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఎందుకు తీసుకుంటారు? ఏది ఏమైనా.. కేవలం యూత్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. సీనియర్ నేతల నుంచి జగన్ కు ఎప్పటికైనా ముప్పు వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాళ్లను కూడా సంతృప్తి పరచకపోతే.. పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే ప్రమాదం ఉందని.. దాని వల్ల సీఎం జగన్ కు, పార్టీకే నష్టం అని.. అందుకే సీఎం జగన్.. సీనియర్ నేతలను కూడా దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని విశ్లేషకులు చెబుతున్నారు.