Amaravathi : అప్పుల కోసం వందల ఎకరాల భూమి తనకా.. బయట పడ్డ మరో బాగోతం
Amaravathi : వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సారి విమర్శల పాలు అయింది. అమరావతి రాజధాని గా అవసరం లేదు కానీ రుణాలు తీసుకోవడం మాత్రం మా అమరావతి రైతుల భూములు కావాలా అంటూ ఇప్పటికే ఆ ప్రాంత జనాలు మరియు రాజకీయ నాయకులు విమర్శలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం రాజకీయ వర్గాల్లో మరియు అమరావతి ప్రాంత వాసులు చర్చ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. అప్పులు చేసేందుకు అమరావతి భూములు కొత్తగా తనకా పెట్టడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తుంది. బ్యాంకుకు సంబంధించిన వ్యవహారలు పూర్తి అయ్యి లోన్ కూడా పూర్తి అయిన తర్వాత వ్యవహారం బయటకు వచ్చింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. అమరావతి పరిధిలో ఉన్న 480 ఎకరాల సిఆర్డిఏ భూమి బ్యాంకులో రుణాలు నిమిత్తం తనకా పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల ఉద్యోగుల సమ్మె సమయం లో రిజిస్టార్ ఆఫీసులో మూసి వేసి ఉన్నాయి. అయినా కూడా అదే సమయంలో ఉద్యోగులపై ఒత్తిడి చేసి మరీ బ్యాంకు కు తనకా రిజిస్ట్రేషన్ ను ప్రభుత్వం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. బ్యాంకులో ఇప్పటికే అమరావతికి చెందిన భారీ ఎత్తున భూమిని తనఖా పెట్టడం జరిగిందట. ఇప్పుడు ఈ 480 ఎకరాల భూమిని కూడా తన కనిపెట్టడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా భూమిని తనక పెట్టుకుంటూ పోతే అమరావతి లో మిగిలేది ఏమిటి అంటూ ఆ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో అమరావతి రాజధానిగా అవసరం లేని జగన్ ప్రభుత్వంకు భూములు మాత్రం తనకా పెట్టుకోడానికి కావాలా అంటూ అక్కడి జనాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి లో భూమి రిజిస్ట్రేషన్ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. 480 ఎకరాలను ప్రభుత్వం బ్యాంకు కు తనకా పెట్టినట్లుగా వారు క్లారిటీ ఇచ్చారు.
Amaravathi : ఇది ఏ ప్రభుత్వం అయినా చేసే పనే..
బ్యాంకు తనకా పెట్టడం కోసం రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్లుగా వారు ధ్రువీకరించారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇక వైకాపా నాయకుల విషయానికి వస్తే గతంలో తనకా పెట్టిన భూమిని విడిపించేందుకు గాను ఇప్పుడు ఈ భూమిని తనకా పెట్టడం జరిగింది. ఆ భూమి ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించడం కోసం మార్పడి చేశాం తప్ప కొత్తగా తనకా పెట్టింది ఏమీ లేదు అంటున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు ఈ విషయాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వైకాపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉంటే బ్యాంకులకు తనకా ఏ ప్రభుత్వం అయినా పెట్టి అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తుందని ఈ సందర్బంగా వైకాపా నాయకులు అంటున్నారు.