AP Government : బహిరంగ సభలు, ర్యాలీల విషయంలో.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
AP Government : రాష్ట్రంలో బహిరంగ సభలు ర్యాలీల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీలో రోడ్లపై బహిరంగ సభలను ర్యాలీలను.. నిషేధించడం జరిగింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై మార్జిన్ లలో సభలు మరియు ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో అరుదైన సందర్భాలలో ఎస్పీలు మరియు సీపీలు అనుమతులు ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఇటీవల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు మరియు గుంటూరు లలో జరిగిన కార్యక్రమాలలో 11 మంది మరణించడం తెలిసిందే. ఇటీవల కొన్ని పార్టీలు తమ సభలకు భారీ ఎత్తున జనం వచ్చినట్లు చూపించుకోవటానికి ఇరుకున్న సందుల్లో మీటింగులు పెట్టడం జరిగింది. దీంతో తోపులాటలు మరియు తొక్కేసలాటలు జరుగుతూ జనాలు మరణించడం జరిగింది. ఈ తరహా లోనే నెల్లూరు కందుకూరులో చంద్రబాబు రోడ్డు షోలో తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు.
ఈ ఘటన జరిగిన మూడు రోజులకే గుంటూరు వికాస్ నగర్ లో చీరల పంపిణీ కార్యక్రమంలో ముగ్గురు మహిళలు మృతి చెందడం జరిగింది. ఈ పరిణామాలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ర్యాలీలు రోడ్లపై కాకుండా ఇంకెక్కడ చేస్తారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.