Ap Govt : ఏపీలో ఇకపై 26 జిల్లాలు.. జాబితా ఇదే..!
Ap Govt : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు నేడు నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది ప్రభుత్వం.30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల ఫిబ్రవరి 26 వ తేదీ వరకూ ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించనున్నారు. ఉగాది నాటికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆఫిషియల్ గా ప్రకటన రానుంది. కాగా ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పడనున్నాయి.
శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ కడపతో పాటు కొత్తగా నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాగా పుట్టపర్తి, రాయచోటిని అన్నమయ్య జిల్లాగా, తిరుపతిని శ్రీ బాలాజీ జిల్లాగా, ఎన్‌టీఆర్ జిల్లాగా విజయవాడ, మన్యం జిల్లాగా పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాగా పాడేరు, బాపట్ల, పల్నాడు జిల్లాగా నరసరావుపేట
అనకాపల్లి, కోనసీమగా అమలాపురం, రాజమహేంద్రవరం, మచిలీపట్నంతో కలిపి మొత్తం 26 జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలుండగా…. ప్రతి లోక్‌సభ ఒక జిల్లాగా మారితే 25 జిల్లాలు ఏర్పాటు కావల్సి ఉంటుంది. అయితే..అరకు లోక్‌సభ చాలా పెద్దదిగా ఉండటంతో ఆ ఒక్క నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేయనున్నట్లు సమాచారం.