గుడ్ న్యూస్.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
Andayya Medicine : ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే మరో 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను పొడిగించింది. ఈ రోజుతో ఏపీలో కర్ఫ్యూ ముగుస్తుండటంతో.. జగన్ నేతృత్వంలో ఏపీ కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో సీఎం జగన్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి.. ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం. అయితే.. కంటిలో వేసే మందు తప్ప మిగితా ఆయుర్వేద మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఆనందయ్య మందు ఎలాంటి హానికరం కాదు అని నివేదికలు కూడా వచ్చాయి. సిసిఆర్ ఎఎస్ ఆనందయ్య మందుపై పాజిటివ్ నివేదిక ఇవ్వడంతో.. ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కంట్లో వేసే చుక్కల మందు తప్ప
కంట్లో వేసే చుక్కల మందు నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఆనందయ్య మందుల్లో పీ, ఎల్ , ఎఫ్ రకాలకు మాత్రమే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మందు వల్ల కరోనా తగ్గుతుంది అనే గ్యారెంటీ మాత్రం ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆనందయ్య మందు పంపిణీ చేయాలని సూచించింది. కరోనా వచ్చిన వారు నేరుగా వెళ్లి ఆనందయ్య వద్ద మందు తీసుకోవద్దు, వారి బంధువు ఎవరైనా వెళ్లి కరోనా మందు తీసుకోవాలి అని స్పష్టం చేసింది. గతంలో హాస్పటల్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను వేసుకొని నేరుగా మందు కోసం వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది.
కోటయ్య అనే వ్యక్తి ఈ రోజు ఉదయం మరణించడం తెలిసిందే, కంట్లో మందు వేసుకున్న తర్వాత అతను వెంటనే లేచి కూర్చోవడం జరిగింది. ఆక్సిజన్ లేవల్స్ కూడా బాగా పెరిగాయని రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య చెప్పారు. అయితే ఆ తర్వాత ఆయన మళ్లీ హాస్పటల్ చేరడం.. ఈ రోజు మరణించడం జరిగింది. కాగా ఆనందయ్య మందుపై ప్రభుత్వ సమీక్షా సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చింది. ఆనందయ్య మందు పంపిణీ పై ప్రభుత్వం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుందని ఏపీ హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఏపీలో కరోనా కట్టడికి కర్ఫ్యూను మరో 10 రోజులు పొడిగించడంతో పాటు కర్ఫ్యూ వేళల్లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఎప్పటిలాగే ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. కర్ఫ్యూ వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగించడం వల్ల కరోనా కేసులు మరింత తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.