Minister Roja : ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మరీ రోజాకి ‘ఆ పదవి’ కట్టబెట్టిన జగన్ మోహన్ రెడ్డి, ఆమె డ్యాన్సులే డ్యాన్స్ లు!

Advertisement

Minister Roja : ఏపీ మంత్రి రోజా జాక్ పాట్ కొట్టింది. తనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో చోటు దక్కింది. ప్రస్తుతం తనను ఏపీలో క్రీడల, టూరిజం శాఖ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా.. మంత్రి రోజాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో స్థానం కల్పిస్తూ జనరల్ బాడీ ఆఫ్ ఇండియా సెక్రటరీ జతిన్ నర్వాల్ లేఖ రాశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కేంద్ర క్రీడల మంత్రి అధ్యక్షుడిగా ఉంటారు. దీనికి ఒక కార్యవర్గం ఉంటుంది. దాంట్లో సభ్యులుగా ఏపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా

ap Minister Roja appointed in sports authority of india
ap Minister Roja appointed in sports authority of india

, త్రిపుర హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన క్రీడా మంత్రులు ఉంటారు. ప్రస్తుతం రోజా ఏపీ క్రీడల మంత్రి కాబట్టి తనకు కార్యవర్గ సభ్యురాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అవకాశం దక్కింది. ఇక.. క్రీడల శాఖ మంత్రిగా రోజా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. పలు స్కూళ్లలోని కార్యక్రమాల్లో పాల్గొని తనే గేమ్స్ ఆడుతూ విద్యార్థులను రోజా ప్రోత్సహిస్తున్నారు. నగరి నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన రోజా.. మంత్రివర్గ విస్తరణలో మంత్రిగా చోటు దక్కించుకున్నారు. అయితే..

Advertisement
ap Minister Roja appointed in sports authority of india
ap Minister Roja appointed in sports authority of india

Minister Roja : రోజాకు తెలియకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైసీపీ నేతలు

మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గం నుంచి అసమ్మతి పోరు ఎక్కువవుతోంది. నగరిలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే కనీసం నగరి ఎమ్మెల్యే అని కూడా తనను పిలవడం లేదని మంత్రి రోజా ఇటీవల సీఎం జగన్ కు ఫిర్యాదు కూడా చేశారు. అయినా కూడా రోజాను పిలవకుండానే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో రోజా పలు సార్లు సీరియస్ అయ్యారు. తనపై కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తను సోషల్ మీడియాలో ఫైర్ అయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement