Chandrababu : చంద్రబాబుకి రెడీగా ఉన్న ప్రమాదం? రోజా ఓపెన్ గా చెప్పేసిందిగా..!

Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి రోజా మరోసారి రెచ్చిపోయారు. ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా తన కొడుకు నారా లోకేశ్ వల్లనే చంద్రబాబుకు పెద్ద ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తారకరత్న చావు బతుకుల మధ్య ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఆసుపత్రిలో చేరడానికి, చావు బతుకుల మధ్య ఉండటానికి నారా లోకేశ్ అనే లెగే ప్రధానం కారణం అంటూ నారా లోకేశ్ పై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన వల్లే అంతగా బాధపడుతున్న తారకరత్నను కనీసం పరామర్శించే తీరిక కూడా నారా లోకేశ్ కు లేకుండా పోయిందా అంటూ మంత్రి రోజా ధ్వజమెత్తారు. వైజాగ్ లో మీడియాతో మాట్లాడిన రోజా పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక సైకో..

Minister Roja comments on chandrababu naidu
Minister Roja comments on chandrababu naidu

ఆయన కొడుకు లోకేశ్ ఒక ఐరెన్ లెగ్. లోకేశ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. లోకేశ్ అడుగు పెట్టగానే.. రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు. లోకేశ్ ఎమ్మెల్సీ అయి అసెంబ్లీలో అడుగు పెట్టాడో లేదో ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు వచ్చాయి. యువగళం పోస్టర్ ను రిలీజ్ చేస్తున్న సమయంలో.. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో ఎనిమిది మంది చనిపోయారు. పాదయాత్ర ప్రారంభించిన తొలి రోజే తారకరత్న ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పుడు ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన్ను పరామర్శించడానికి కూడా లోకేశ్ కు టైం లేదు అంటూ మంత్రి రోజా సీరియస్ అయ్యారు.

Advertisement
minister roja comments on tdp chief chandrababu
minister roja comments on tdp chief chandrababu

Chandrababu : సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేశ్ కు లేదు

సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నారా లోకేశ్ కు లేదని మంత్రి రోజా మండిపడ్డారు. పాదయాత్ర తొలి రోజే ఆయన ప్రసంగాన్ని అందరూ చూశారని, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రాని వ్యక్తి నాయకుడు అవుతాడా? నారా లోకేశ్ కు జగన్ కు ఎలాంటి పోలిక లేదు. తన తండ్రి ఆశయాల సాధన కోసం, సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు. అధికారంలోకి రాగానే.. వచ్చిన మూడేళ్లలోనే 98 శాతం హామీలు పూర్తి చేశారు అని మంత్రి రోజా స్పష్టం చేశారు.

Advertisement
Advertisement