Roja – Balakrishna : బాలకృష్ణపై మంత్రి రోజా అటాక్.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు అంటూ కౌంటర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja – Balakrishna : బాలకృష్ణపై మంత్రి రోజా అటాక్.. ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ ముందు కాదు అంటూ కౌంటర్

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 September 2022,1:30 pm

Roja – Balakrishna : ఏపీలో ప్రస్తుతం రెండే విషయాలు ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒకటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు, రెండోది మూడు రాజధానుల అంశం. అయితే.. ఎన్టీఆర్ పేరును మార్చి వైఎస్సార్ పేరును పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి.. ఉన్నపళంగా ఎందుకు ఎన్టీఆర్ పేరును మారుస్తున్నారు అంటూ పలువురు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ పార్టీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. తాజాగా బాలకృష్ణ కూడా ఈ విషయంపై స్పందించారు. బాలకృష్ణ స్పందనపై పలువురు వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు.

తాజాగా మంత్రి రోజా కూడా ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ నే ఉపయోగించి ఆయనపై అటాక్ చేశారు రోజా. ట్విట్టర్ లో బాలయ్యపై ఓ ట్వీట్ చేసిన రోజా.. బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు.. జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ”గన్” అనే రియల్ సింహం. తేడా వస్తే దబిడి దిబిడే.. అంటూ ట్వీట్ చేశారు రోజా.

ap minister roja comments on nandamuri balakrishna

ap minister roja comments on nandamuri balakrishna

Roja – Balakrishna : సోషల్ మీడియాలో వైరల్ అయిన రోజా ట్వీట్

ప్రస్తుతం రోజా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఎన్టీఆర్ పేరు మార్పుపై బాలకృష్ణ ఏం ట్వీట్ చేశారంటే.. ఎన్టీఆర్ అనేది పేరు కాదు. సంస్కృతి. మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై వెంటనే వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తాజాగా రోజా కూడా ఆ ట్వీట్ పై బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి