Karthika Deepam 2 Today Episode : జ్యోత్స్న రహస్యం బయటపడే ప్రమాదం.. ఆగ్రహంతో ఊగిపోయిన శివ నారాయణ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 2 Today Episode : జ్యోత్స్న రహస్యం బయటపడే ప్రమాదం.. ఆగ్రహంతో ఊగిపోయిన శివ నారాయణ

 Authored By suma | The Telugu News | Updated on :21 January 2026,9:30 am

ప్రధానాంశాలు:

  •  Karthika Deepam 2 Today Episode : జ్యోత్స్న రహస్యం బయటపడే ప్రమాదం.. ఆగ్రహంతో ఊగిపోయిన శివ నారాయణ

Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు, అనుమానాలతో ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ చిన్నప్పటి ఫొటో గురించి దీప అడగడంతో సుమిత్ర సరదాగా ఒక సరదా కథ చెబుతుంది. కాంచనకు ఆడపిల్లలంటే ఎంత ఇష్టమో చెప్పుతూ కార్తీక్‌ను చిన్నప్పుడు అమ్మాయిలా రెడీ చేసి జడలు వేసి పూలు పెట్టేదని గుర్తు చేస్తుంది. ఒక పండగ రోజున అలా రెడీ చేసినప్పుడు ఆట మధ్యలో ఓ అబ్బాయి పెద్దయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడని చెప్పడంతో అందరూ నవ్వులతో మునిగిపోతారు. అయితే ఈ నవ్వుల మధ్య జ్యోత్స్నలో మాత్రం టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఎక్కడ నిజం బయటపడుతుందోనన్న భయం ఆమెను వణికిస్తుంది. రిపోర్ట్స్ అంటే కేవలం కాగితాలు కాదు నిజాలని జ్యో మనసులోనే భయపడుతుంది. తాను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా ఎదురొస్తాయేమోనని ఆందోళన చెందుతుంది. ముందు దాసుగాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అసలు వారసురాలిని తీసుకురావాలని పారు చెప్పడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.

Karthika Deepam 2 Today Episode : దీప ప్రశ్నలు – కార్తీక్ సమాధానాలు

మరోవైపు దీప, కార్తీక్ మధ్య కీలకమైన సంభాషణ జరుగుతుంది. ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఎవరు ఇచ్చారంటూ దీప ప్రశ్నిస్తుంది. ఈరోజు సరదాగా ఫొటో చూపించి నవ్వించావు కానీ నిజం తెలిసినప్పుడు బాధ ఎలా తప్పిస్తావని నిలదీస్తుంది. సొంత కూతురు ఎక్కడుందన్న ప్రశ్న వస్తే ఏం చెబుతావని దీప అడిగితే “నువ్వే కూతురు” అని చెబుతానని కార్తీక్ అంటాడు. అయితే నిజాన్ని ముందుగా తాతకు తర్వాత అమ్మానాన్నలకు చెప్పాల్సిందేనని దీప స్పష్టం చేస్తుంది.
ఇదే సమయంలో జ్యోత్స్న శాంపిల్ మ్యాచ్ అవదని డాక్టర్ చెబుతాడని కార్తీక్ అనగా కాంచన వచ్చి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. జ్యోత్స్న అసలు తమ అన్నయ్య కూతురేనా? మరి నిజమైన వారసురాలు ఎవరు? అంటూ కాంచన అడిగే ప్రశ్నలు కథను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. కార్తీక్ మాత్రం హాస్పిటల్‌లో జ్యోత్స్న, పారు భయపడ్డారని కవర్ చేస్తాడు.

Karthika Deepam 2 Today Episode : శివ నారాయణ ఆగ్రహం – జ్యోత్స్నకు గట్టి షాక్

ఎపిసోడ్‌లో కీలక మలుపు శివ నారాయణ ఆగ్రహం. సుమిత్ర భోజనం చేయలేదని మందులు కూడా వేసుకోలేదని దశరథ చెప్పడంతో శివ నారాయణ జ్యోత్స్నను పిలుస్తాడు. అప్పుడు ఒక్కసారిగా బాంబు పేల్చినట్టుగా జ్యోత్స్న నా మనవరాలు కాదు..అసలు సుమిత్ర కూతురు కూడా కాదు అంటూ గట్టిగా అరుస్తాడు. నన్ను తాత అని పిలవాల్సిన అవసరం లేదంటూ జ్యోత్స్నపై ఫైర్ అవుతాడు. నీకు జ్వరం వస్తే నీ అమ్మ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. మరి నువ్వు ఆమెను ఎందుకు చూసుకోలేదని నిలదీస్తాడు. పెద్దదానివై ఉండి కూడా బాధ్యత లేదని పారుపై కూడా శివ నారాయణ ఆగ్రహం చూపిస్తాడు. అయితే సుమిత్ర మాత్రం జ్యోత్స్నను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోతుంది. అమ్మ నీకెంత ఇష్టమో అర్థం చేసుకోమని ఈ కష్టకాలంలో నీ సహాయం అవసరమని దశరథ జ్యోత్స్నకు చెబుతాడు. చివర్లో శివ నారాయణ కాంచనను రెండు రోజులు ఇంటికి రావాలని కోరుతాడు. కానీ వదిన పరిస్థితి చూసి ధైర్యం సరిపోవడం లేదని కాంచన రావడం లేదని చెప్పడంతో అనేక ప్రశ్నలు అనుమానాలతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది. జ్యోత్స్న రహస్యం ఎప్పుడు బయటపడుతుందోనన్న ఉత్కంఠతో రేపటి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.

 

suma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది