Attack on Temples : ఆ విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారో తెలిసిపోయింది? షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోలీసులు?
ఏపీలో గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది ఒకే విషయం మీద. అదే హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు. నిజానికి 2019 లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చాక ఈ దాడులు ప్రారంభమయ్యాయి. ఒకదాని తర్వాత మరోటి.. ఇలా వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. వందల కొద్ది ఘటనలు జరుగుతున్నా.. పోలీసులు మాత్రం అసలైన నేరస్తులను ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు.
విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రామతీర్థం ఘటనపై హిందుత్వ వాదులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దేవుడు ఏం చేశాడు? దేవుడిని ఎందుకు ఇలా నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు.. అంటూ ప్రశ్నించారు.
అయితే.. ముఖ్యమంత్రి జగన్ కూడా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీరియస్ గా ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నారు. అయితే.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఉన్న విఘ్నేశ్వరాలయంలో సుబ్రహణ్యస్వామి విగ్రహం ధ్వంసం కేసు దర్యాప్తును పోలీసులు పూర్తి చేశారు. కేసును చేధించిన పోలీసులు.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
వివరాలను వెల్లడించిన విజయవాడ సిట్ డిపార్ట్ మెంట్ డీఐజీ అశోక్ కుమార్
జనవరి 1 వ తేదీన సుబ్రమణ్యస్వామి విగ్రహం ధ్వంసం అయినట్టు కేసు నమోదు అయిందని ఆయన చెప్పారు. దీనిపై విచారణ జరపగా.. తెలిసిన విషయం ఏంటంటే.. ఆలయంలో పూజు నిర్వహించే పూజారి వెంకట మురళీకృష్ణే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఆలయ పూజారే డబ్బు కోసం ఈ పని చేశాడని.. కొందరు దుండగులు పూజారికి 30 వేల రూపాయలు డబ్బులు ఇచ్చి.. ఈ పని చేయించారని తెలిపారు.
అయితే.. విగ్రహాన్ని ధ్వంసం చేయించినవాళ్లు.. రాజకీయ లబ్ధి కోసమే ఈ పని చేయించారని.. తొందరలోనే వాళ్లను కూడా పట్టుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆలయ పూజారితో పాటు.. మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.