MP Bharath : దమ్ముంటే రాజమండ్రిలో నాతో పోటీ చేయ్.. నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎంపీ మార్గాని భరత్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

MP Bharath : దమ్ముంటే రాజమండ్రిలో నాతో పోటీ చేయ్.. నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎంపీ మార్గాని భరత్ ..!

MP Bharath : రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్డు ఏకేసి కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 January 2024,12:10 pm

ప్రధానాంశాలు:

  •  MP Bharath : దమ్ముంటే రాజమండ్రిలో నాతో పోటీ చేయ్.. నారా లోకేష్ కు సవాల్ విసిరిన ఎంపీ మార్గాని భరత్ ..!

MP Bharath : రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై నిప్పులు చెరిగారు. మంగళవారం నగరంలోని జేఎన్ రోడ్డు ఏకేసి కళాశాలకు ఆనుకుని ఉన్న పార్కులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసింది టీడీపీ చంద్రబాబు నాయుడు అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు ఎంతమందిని తీసుకొచ్చిన నేను ఒక్కడినే చర్చకు వస్తా చంద్రబాబుకు ఆ దమ్ము, ధైర్యం ఉందా అని సూటిగా ప్రశ్నించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు సీఎం చేశానని గొప్పలు చెప్పుకోవడం తప్పిస్తే రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గాన్ని అయినా తాను రాజమండ్రిని అభివృద్ధి చేసినట్లు కనీసం నాలుగోవంతైన చేసావా అని చంద్రబాబును ఉద్దేశించి భారత్ ప్రశ్నించారు.

పుష్కరాలకు 2000 కోట్లు శాంక్షన్ చేసానని చెప్పుకోవడం తప్పిస్తే ఆ నిధులతో రాజమండ్రిలో ఏం చేసావో చెప్పగలవా, చూపగలవా అని ప్రశ్నించారు. పందికొక్కులా మెక్కేసి నీతిపరుల్లా ఫోజులా అని వ్యాఖ్యానించారు. నేను ఎంపీగా ఈ నాలుగున్నర ఏళ్లలో కేవలం 400 కోట్లతో రాజమండ్రి రూపురేఖలు మార్చాను. ఎప్పుడొచ్చామన్నది కాదు ఎంత అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది అనేది ప్రధానం. పార్లమెంటులో నేను మాట్లాడినట్టుగా నీ పార్టీ ఎంపీలు గత పది సంవత్సరాల రికార్డు పరిశీలించి చెప్పు. రాష్ట్ర జాతీయ సమస్యలపై లోక్ సభలో ఎక్కువగా మాట్లాడింది నేనే అని, నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే రాజమండ్రిలో ఎమ్మెల్యేగా నాపై పోటీ చేయి నువ్వు కాకపోతే నీ కొడుకు లోకేష్ అయినా ఇక్కడికి పంపి నన్ను ఓడించు అని భరత్ సవాల్ విసిరారు. నేను చేసిన డెవలప్మెంట్ ను నారా లోకేష్ 50% అయినా చేస్తాడా అని తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కి సబ్జెక్టు ఉందని అతడి వల్ల అయినా పార్టీ బ్రతుకుతుందని, నీ పప్పుసుద్ద లోకేష్ ను పెట్టుకుంటే పార్టీ లేవదు అని ఎద్దేవా చేశారు.

ఆవ భూములలో 150 కోట్లు కొట్టేసానని వర్కులో 15% తీసుకుంటానని అభాండాలు వేశావు. ఒక్కదాంట్లో అయినా నిరూపించగలరని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి భరత్ సూటిగా ప్రశ్నించారు. ఏ ఒక్కటి నిరూపించిన రాజకీయాలు వదిలేస్తా అని అన్నారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నా ఊరును అభివృద్ధి చేయాలనే కాంక్ష తప్పిస్తే రాజకీయాలను అడ్డుపెట్టుకొని సంపాదించాలని ఆలోచన నీకు లేదన్నారు. రాజమండ్రి నగరం జేఎన్ రోడ్డులో గల పార్కును మహా నాయకుడు ఏకేసి పేరు పెడితే దానిని ఎన్టీఆర్ పార్టుగా 2015లో తీర్మానం చేసేసి ఎలా మారుస్తారని ప్రశ్నించారు. మేము తీర్మానిస్తున్నాం. ఈ పార్కుకు గతంలో ఏ పేరు అయితే ఉందో ఏకేసి పార్కు అలాగే ఉండాలని ఈ విషయమై కలెక్టర్ కమిషనర్ కు పంపిస్తామని అన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది