anandaiah Eye Drops : ఆనందయ్య కంట్లో వేసే మందుకు హైకోర్టు అనుమతి
anandaiah Eye Drops ఆనందయ్య కంట్లో వేసే కె అనే మందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంట్లో వేసే మందు కాకుండా మిగతా మందులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. బొనిగె ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందు( కె ) Anandiah Eye Drops పై ఏపీ హైకోర్టు పూర్తి విచారణ జరిపి తర్వాత హైకోర్టు తన తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఈరోజు ఆ మందుపై తీర్పును ప్రకటించింది.
anandaiahEye Drops ఆనందయ్య కంట్లో వేసే మందు కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆనందయ్య కంట్లో వేసే మందు ( కె )ను anandaiah Eye Drops వెంటనే పంపిణీకి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కె అనే మందుకు తక్షణమే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు సూచించింది. కె అనే మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచిస్తూ విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఆనందయ్య ఇచ్చిన కంట్లో వేసే మందు శాంపిల్స్ ప్రభుత్వానికి సమర్పించారు. ఈ మందు వల్ల ఎలాంటి నష్టం లేదని నివేదికలో వచ్చింది. దీంతో ఏపీ హైకోర్టు ఆ మందుకు అనుమతి ఇచ్చింది.
ఇది ఇలా ఉండగా.. ఆనందయ్య ఈ రోజు ( సోమవారం ) మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అయితే కేవలం సోమవారం నాడు 2 వేల మందికి మాత్రమే మందు పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముందుగా ఈ మందు పంపిణీ కరోనా బాధితులకు ప్రాదాన్యం ఉంటుందని ఆనందయ్య తెలిపారు. అయితే రోజుకు 5 వేల మందికి మందు పంపిణీ చేయాలని అనుకున్నా తగిన సౌక్యాలు లేక 2 వేల మందికి మాత్రమే ఇస్తున్నాం అని ఆయన చెప్పారు. అలాగే సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు మందు పంపిణీ తొలి ప్రాదాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే గ్రామ వాలంటీర్లు, స్వచ్చంద సంస్థల కార్యకర్తల ద్వారా కూడా మందు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు.