Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్లకి వాటిని బయటకు తీసారు..!
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించనున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాని పర్యటనకు సంబందించి చారిత్రక ప్రదర్శన ఏర్పాటు చేయడానికి అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

#image_title
చారిత్రక ప్రదర్శనతో ప్రత్యేక స్వాగతం
ప్రధాని శ్రీశైలం ఆలయాన్ని సందర్శించే సమయంలో, ఆలయ చరిత్రను వివరించేందుకు భారత పురావస్తుశాఖ ప్రత్యేకంగా తామ్రశాసనాల ప్రదర్శనను సిద్ధం చేస్తోంది. ఈ శాసనాల్లో ఆలయ చరిత్ర, రాజుల విరాళాలు, పునరుద్ధరణలు, ఉత్సవాలు, భూకంపాలు, తోకచుక్కల సందర్భాల వంటి వివరాలు ఉన్నాయి.
మొత్తం 20 తామ్ర శాసనాల గుత్తులు,మొత్తం 79 రాగి రేకులు, తెలుగు, సంస్కృతం, దేవనాగరి, హిందీ, ఉర్దూ భాషలలో పురావస్తుశాఖ సంచాలకుడు మునిరత్నంరెడ్డి ఈ శాసనాల వివరాలతో ప్రత్యేకంగా ఒక పుస్తకం కూడా రచించారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం కార్యాలయం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అధికారులతో పాటు, జిల్లా యంత్రాంగం అత్యంత నిఖార్సైన భద్రతా చర్యల మధ్య ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.ఈ సందర్బంగా మోదీ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ఆలయ చరిత్రకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయడం ఇది మొదటిసారి కానప్పటికీ, ప్రధానిగా మోదీకి ఈ అనుభవం ప్రత్యేకంగా నిలవనుంది.