Sleep | రాత్రి 1–3 గంటల మధ్య లేస్తున్నారా.. కారణాలు, పరిష్కారాలు ఇవే
Sleep |ప్రతి ఒక్కరికీ రోజుకు 6–8 గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర మన శరీరాన్ని, మనసును రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. అయితే, కొంతమంది రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య తరచుగా లేచిపోతున్నారు, తిరిగి నిద్రపోవడం కష్టమవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు.
#image_title
రాత్రి నిద్రకు అంతరాయం కలిగించే ప్రధాన కారణాలు:
వయస్సు పెరగడం: వయసు పెరిగే కొద్దీ నిద్ర చక్రాలు మారడం వల్ల రాత్రిపూట మేల్కోవడం సాధారణం.
ఒత్తిడి (Stress): ఒత్తిడి శరీరంలోని నాడీ వ్యవస్థలను సక్రియం చేసి రాత్రి మధ్యలో మేల్కొనడానికి దారితీస్తుంది. ఇది రక్తపోటు మార్పులు, గుండె వేగం పెరగడానికి కారణమవుతుంది.
మందుల దుష్ప్రభావాలు: కొన్ని మందులు, ముఖ్యంగా డీకాంగెస్టెంట్లు, యాంటిడిప్రెసెంట్స్, దీర్ఘకాలికంగా తీసుకుంటే నిద్రను ప్రభావితం చేస్తాయి.
కాలేయ సమస్యలు (Liver Problems): రాత్రి మధ్యలో లేవడం కాలేయ పనితీరులో సమస్యలకు సంకేతం కావచ్చు. కాలేయ లోపం రక్త ప్రసరణను ప్రభావితం చేస్తూ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.
ఇతర ఆరోగ్య సమస్యలు: గ్యాస్ట్రిక్ ఆర్థరైటిస్, డిప్రెషన్, మెనోపాజ్, స్లీప్ అప్నియా వంటివి రాత్రిపూట నిద్రకు భంగం కలిగిస్తాయి.
పరిష్కార సూచనలు:
రాత్రి లేచినప్పుడు భయపడకుండా శాంతంగా ఉండటం ముఖ్యము.
గడియారాన్ని పదే పదే చూడకుండా దీర్ఘ శ్వాసలు తీసుకోవడం, మెడిటేషన్ చేయడం.
20 నిమిషాల పాటు నిద్రపోలేకపోతే, మంచం నుంచి లేచి పుస్తకం చదవడం, తేలికపాటి సంగీతం వినడం.
మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ వాడకండి, ఇవి నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.
పడకగది శుభ్రంగా, శాంతియుతంగా ఉంచడం.
నిరంతరంగా రాత్రి మధ్యలో లేవడం సమస్యగా మారితే, డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. ఆరోగ్య సమస్యలను తొలగించడం ద్వారా, రాత్రి నిద్ర సౌకర్యంగా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.