Arjuna Bark | హార్ట్‌కు రక్షణ: గుండె ఆరోగ్యానికి అర్జున బెరడు..ఆయుర్వేదంలో అద్భుత ఔషధం
Arjuna Bark | ప్రపంచ వ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న ఈ యుగంలో, సహజ చికిత్సా మార్గాలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. అలాంటి మార్గాల్లో భారతీయ ఆయుర్వేదం అందించిన ఓ అమూల్య ఔషధం అర్జున చెట్టు (టెర్మినాలియా అర్జున) నుంచి లభించే అర్జున బెరడు.పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో గుండె క్షేత్రంలో అర్జున బెరడు ప్రాముఖ్యతతో పేర్కొనబడింది.
#image_title
ఇది గుండె కండరాలను బలోపేతం చేయడం, రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వును నివారించడం, ధమనుల్లో రక్తప్రసరణను మెరుగుపర్చడం వంటి కీలక పనులను నిర్వర్తించగలదు. అర్జున బెరడులో టానిన్లు, సపోనిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, కూమరిన్లు లాంటి శక్తివంతమైన సహజ పదార్థాలు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణ కలిగించడంలో సహాయపడతాయి. దీని యాంటీఆక్సిడెంట్ గుణాలు వయస్సు కారణంగా జరిగే గుండె నష్టాన్ని తగ్గించగలవని శాస్త్రీయ పరిశోధనలు సూచిస్తున్నాయి.
అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయం
చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంపొందించే గుణం అర్జున బెరడుకు ఉంది. ఇది బ్లడ్ ప్రెషర్‌ను సహజంగా నియంత్రించగలదు. కొంతమంది వైద్య నిపుణులు దీన్ని బీటా-బ్లాకర్లకు సహజ ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు.
వినియోగ విధానం
అర్జున బెరడును కషాయం, పొడి, లేదా హెర్బల్ టీ రూపంలో తీసుకోవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఇవ్వవచ్చు. తేనె లేదా గోరువెచ్చని నీటితో 1–3 గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి.