Delhi Cm | ప్రజా దర్బార్‌లో ఉద్రిక్తత .. ఢిల్లీ సీఎం రేఖ గుప్తాపై దాడికి యత్నం
Delhi Cm | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై ప్రజా దర్బార్ సందర్భంగా ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించిన సంఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన సివిల్ లైన్స్‌లోని సీఎం అధికారిక నివాసంలో బహిరంగ విచారణ (పబ్లిక్ హియరింగ్) సందర్భంగా చోటుచేసుకుంది.
#image_title
ఆకస్మిక దాడి ప్రయత్నం
ప్రజల ఫిర్యాదులను స్వయంగా వింటున్న సమయంలో, ఓ వ్యక్తి ముఖ్యమంత్రి వద్దకు చేరి తన సమస్య చెప్పే నటన చేశాడు. కానీ అకస్మాత్తుగా రాయిలాంటి వస్తువుతో దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, అక్కడ ఉన్న స్థానికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.దాడికి ప్రయత్నించిన వ్యక్తి వయస్సు సుమారు 35 ఏళ్లు అని పోలీసుల ప్రాథమిక నివేదిక తెలిపింది.
దాడి సమయంలో అసభ్య పదజాలంతో దూషించాడు అని కూడా వెల్లడించారు. ఘటన తాలూకు వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించబడ్డాయి. దాడి తర్వాత సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల అనుమానం మేరకు, ఈ వ్యక్తికి ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.