Rekha Gupta : తొలిసారి ఎమ్మెల్యే.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. ఆమె బ్యాక్‌గౌండ్ ఏంటి..?
ప్రధానాంశాలు:
తొలిసారి ఎమ్మెల్యే.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. ఆమె బ్యాక్‌గౌండ్ ఏంటి..?
Rekha Gupta : ఢిల్లీ ముఖ్యమంత్రిగా delhi CM భారతీయ జనతా పార్టీ BJP అధిష్టానం రేఖా గుప్తను ఎంపిక చేసింది. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సీఎం ఎవరవుతారా అనే ఆసక్తి ఉండగా, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాను సీఎంగా సెలక్ట్ చేసి, సంచలన నిర్ణయం తీసుకుంది BJP బీజేపి. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు.

Rekha Gupta : తొలిసారి ఎమ్మెల్యే.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. ఆమె బ్యాక్‌గౌండ్ ఏంటి..?
ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా ఆమె వ్యవహరించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలిగా పని చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. ఢిల్లీ నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది. మహిళలు, బలహీనవర్గాల కోసం ఆమె చేసిన కృషి… ఆమెకు మంచి నాయకురాలిగా పేరు, ప్రఖ్యాతులను తీసుకొచ్చింది.
ఇంతకుముందు బీజేపీ BKP తరఫున సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ తరఫున షీలా దీక్షిత్, ఆప్ తరఫున ఆతిశీలు ఢిల్లీ Rekha Gupta ముఖ్యమంత్రులుగా పనిచేయగా.. ఇప్పుడు బీజేపీ తరఫున రేఖా గుప్తాకు ఆ అవకాశం వచ్చింది.ఢిల్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన 50 ఏళ్ల రేఖా గుప్తా.. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి బందనాకుమారిని 29 వేలకుపైగా ఓట్లతో ఓడించారు. హరియాణాలో పుట్టి ఢిల్లీలో పెరిగిన రేఖా గుప్తా చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపించారు.