Avocado Side Effects | అవకాడో మంచి గుణాల మేళవింపు… కానీ అందరికీ పడదు!
Avocado Side Effects | అవకాడో పండు గురించి తెలియని వారు చాలా తక్కువే. ఈ ఆకుపచ్చ పండు శరీరానికి అవసరమైన అనేక పోషకాలతో నిండి ఉంటుంది. దీనిని ‘బరువు తగ్గించే మేజిక్ ఫ్రూట్’ అని కూడా పేర్కొంటారు.

#image_title
అవకాడో లాభాలు:
హృదయానికి మేలు చేస్తుంది:
అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL), ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
డయాబెటిస్ రోగులకు మంచిది:
ఇందులో చక్కెర తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉంచి ఆకలిని తగ్గిస్తాయి
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది:
మితంగా తీసుకుంటే ఇది బరువు తగ్గే వారికి ఎంతో ఉపయోగకరం. పొట్ట నిండిన ఫీలింగ్ ఇవ్వడం వల్ల మితంగా తినేందుకు తోడ్పడుతుంది.
అవకాడోలో ఎంతైనా మంచి గుణాలు ఉన్నా… కొందరికి మాత్రం ఇది మేలు చేయకపోవచ్చు:
బరువు పెరగొచ్చు:
అవకాడోలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
కిడ్నీ సమస్యలు ఉన్నవారికి జాగ్రత్త:
ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ బాగా లేని వారు దీన్ని మితంగా తినాలి లేదా వైద్యుల సలహా తీసుకోవాలి.
లాటెక్స్ అలెర్జీ ఉన్నవారు తినకూడదు:
లాటెక్స్ అలెర్జీ ఉన్నవారికి అవకాడోలోని కొన్ని ప్రొటీన్లు ఇబ్బందులు కలిగించవచ్చు.
కాలేయ సమస్యలు ఉంటే జాగ్రత్త:
కొంతమంది కి ఇది లివర్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.