అది సీరియస్సా?.. రెచ్చిపోయిన బాబా భాస్కర్.. జాఫర్ పరువుపాయే
బాబా భాస్కర్ బుల్లితెరపై ఎంతగా రచ్చ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో తరువాత బాబా భాస్కర్ ఫుల్ ఫాంలోకి వచ్చాడు. బిగ్ బాస్ మూడో సీజన్లతో బాబా భాస్కర్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జాఫర్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్. అక్కడే ఈ ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో ఈ ఇద్దరూ కలిసి చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అయితే బిగ్ బాస్ షో తరువాత ఎవరి దారి వారిదన్నట్టుగా అయింది. తాజాగా మళ్లీ ఈ ఇద్దరూ ఒకే షోలో కనిపించారు.

Baba Bhaskar On Jaffer In Rechipodam Brother
రెచ్చిపోదాం బ్రదర్ అనే షోలో బాబా భాస్కర్ నిజంగానే రెచ్చిపోతోన్నాడు. ఒక్కొక్కరి మీద దారుణమైన సెటైర్లు వేస్తున్నాడు. తాజాగా బాబా భాస్కర్ తన పంచులతో జాఫర్ పరువుతీసేశాడు. రెచ్చిపోదాం బ్రదర్ షోలో జాఫర్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ స్కిట్ వేశాడు. కమెడియన్ వెంకీ మీద జాఫర్ తన ప్రతాపాన్ని చూపించేందుకు రెడీ అయ్యాడు. నువ్ ఇప్పుడే రిహార్సల్‌కు రావడం లేదు.. పెళ్లైతే వస్తావా? అని జాఫర్ అంటాడు.
జాఫర్ పరువుతీసిన బాబా
పెళ్లైన తరువాత రాకపోతే వాడి భార్య ఫీల్ అవ్వాలి గానీ నీకు ఎందుకు అని బాబా భాస్కర్ అంటాడు. నువ్ ఏమైనా సంసారం చేస్తున్నావా? అని ఆయన అంటున్నాడు అంటూ పక్కన ఉన్న వాళ్లు జాఫర్‌కు ఆ పంచ్‌ను వివరించారు. ఇక్కడ ఇంత సీరియస్‌గా ఇంటరాగేషన్ జరుగుతుంటే సిల్లీ కామెడీ చేస్తారంటే అని జాఫర్ అంటాడు.. ఏంటి అది సీరియస్సా? అక్కడ చూడు పొట్ట ముందుకు వస్తోందని జాఫర్ పరువుతీశాడు బాబా భాస్కర్. మొత్తానికి అలా జాఫర్, బాబా భాస్కర్ కాంబో చాలా రోజుల తరువాత బుల్లితెరపై కనిపించింది.
