Bandi Sanjay రథయాత్ర.. ధర్మపురి అరవింద్ పాదయాత్ర.. బ్యాక్ టూ బ్యాక్ సిద్ధమవుతున్న బీజేపీ?
అస్సలు ఆగడం లేదు. తెలంగాణలో బీజేపీని ముందుకు నడపిస్తున్న నేతలు కొందరే. చాలామంది బీజేపీ నేతలు ఉన్నప్పటికీ.. వీళ్లు మాత్రం అధికార పార్టీని ఇరుకున పెడుతూ.. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తెగ కృషి చేస్తున్నారు. వాళ్లే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వీళ్లిద్దరి వల్లనే ప్రస్తుతం బీజేపీ తెలంగాణలో ఒక స్టేజ్ లో ఉంది. లేకపోతే ఆ పార్ట మనుగడ కష్టంగానే ఉండేది.
వీళ్లకు పూర్తిస్థాయిలో కేంద్రం నుంచి కూడా మద్దతు లభిస్తోంది. హైకమాండ్ కూడా వీళ్లకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడంతో.. అస్సలు ఆగడం లేదు. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడం కోసం వీళ్లు చేస్తున్న ప్రయత్నాలు మామూలుగా లేవు.
ధర్మపురి అరవింద్ కు కీలక పదవి?
అయితే.. తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేస్తున్నందుకు ధర్మపురి అరవింద్ ను మెచ్చి.. త్వరలోనే కీలక పదవిని ఇవ్వనుందట హైకమాండ్. ప్రస్తుతం ఇదే చర్చ జోరుగా సాగుతోంది. బండి సంజయ్ కి కూడా ఏదో కీలక పదవి ఇవ్వనున్నారని వార్తలు వచ్చినా.. వాటిపై క్లారిటీ రాలేదు. ఇప్పుడు ధర్మపురికి మాత్రం అధిష్ఠానం ఖచ్చితంగా కీలక పదవిని కట్టబెడుతోందని.. ఇక ఈ పదవిని ఉపయోగించుకొని అరవింద్.. అధికార పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ.. ధర్మపురి అరవింద్.. తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారట.
వచ్చే ఎన్నికలే టార్గెట్ గా
మా అంటే మరో రెండుమూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే.. ఇప్పటి నుంచే పార్టీని పటిష్ఠం చేయాలని భావించి.. తెలంగాణ వ్యాప్తంగా ధర్మపురి పాదయాత్ర చేస్తారట. ప్రజల్లోకి వెళ్లి.. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి.. ప్రజలతో మమేకం అయి.. పార్టీని బలోపేతం చేయాలనేది ధర్మపురి ప్లాన్ అట.
నిజానికి.. ముందు బండి సంజయ్.. పాదయాత్ర చేయాలని అనుకున్నారు కానీ.. బండి బదులు ధర్మపురి పాదయాత్ర చేస్తారట. హైకమాండ్ సూచన మేరకు ధర్మపురి పాదయాత్ర చేస్తే… బండి సంజయ్ రథయాత్ర చేస్తారట. మొత్తం మీద వీళ్లిద్దరి టార్గెట్ రాబోయే ఎన్నికలే. వామ్మో.. వీళ్లిద్దరిని ఎదుర్కోవాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కు కష్టమే. మరి.. వీళ్లను ఎలా కేసీఆర్ ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.