Bank Holidays : ఈ నెలలో బ్యాంకులు 8 రోజులు పనిచేయవు.. సెలవు దినాల జాబితా ఇదే..
Bank Holidays : ఒకప్పటిలాగా ప్రస్తుతం భౌతిక ఆర్థిక లావాదేవీలు జరగడం లేదని చెప్పలేం. కానీ, గతంతో పోల్చితే చాలా తక్కువగా భౌతిక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా, డిజిటల్ ట్రాంజాక్షన్స్ చేయాలనుకున్న వారందరికీ కంపల్సరీగా తమ అకౌంట్స్‌లో డబ్బులుండాలి. అందుకుగాను వారు బ్యాంకు బ్రాంచికి వెళ్లి మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బ్యాంకుకు సెలవు ఉంటే చాలా కష్టం. కాబట్టి సెలవు జాబితా చూసుకునే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవు దినాలకు సంబంధించిన జాబితా విడుదలైంది. హైదరాబాద్ రీజియన్‌లో అనగా ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకుల సెలవుల వివరాలిలా ఉన్నాయి.
నవంబర్ 7న ఆదివారం బ్యాంకులు ఓపెన్ కావు. 13న రెండో శనివారం, 14 ఆదివారం.. రెండు రోజులూ హాలి డేసె. ఇక నవంబర్ 19న గురునానక్ జయంతి కాగా, ఆ రోజు కూడా బ్యాంకులకు హాలిడే. 21 ఆదివారం కాగా, మొత్తం 27 నాలుగో శనివారం, 28 ఆదివారం బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు. మొత్తంగా హైదరాబాద్ రీజియన్‌లోని బ్యాంకులకు ఎనిమిది రోజులు సెలవులు ఉండగా, ఇందులో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు, నాలుగో శనివారం, దీపావళి, గురునానక్ జయంతి ఉన్నాయి. అయితే, ఇతర రాష్ట్రాలలో పండుగలను బట్టి అక్కడ సెలవు దినాలు వేరుగా ఉంటాయి. నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా కర్నాటకలో హాలీ డే.
Bank Holidays : మొత్తం ఎనిమిది రోజులు సెలవులు..
నవంబర్ 3న నరక చతుర్దశి సందర్భంగా బెంగళూరులో హాలిడే.. ఇలా ఆయా ప్రాంతాలను బట్టి హాలి డేస్ డేట్స్ మారుతుంటాయి. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని వినియోగదారులు తమ పనులను ప్లాన్ చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. సెలవు దినానికి ముందు రోజున కాని లేదా సెలవు దినం అయిపోయిన తర్వాత రోజున కాని బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందుగానే ప్లానింగ్ చేసుకుంటే ఇంకా మంచిది.