Facebook : ఫేస్ బుక్ లో పరిచయం అయ్యే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి .. లేదంటే ఇలాగే అయిపోద్ది మీ బతుకు కూడా..!!
Facebook : ప్రస్తుతం చాలామంది యువత తప్పు ద్రోవ పడుతున్నారు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఫేస్ బుక్ ద్వారా ఒక యువకుడు దారుణంగా మోసపోయాడు. చిత్తూరుకు చెందిన యువకుడు ఇచ్చిన కంప్లైంట్ తో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం చిత్తూరులోని రవిబాబు స్వీట్ షాప్ నడుపుతున్నాడు. అతని కొడుకు 28 ఏళ్ల వైష్ణవకు ఫేస్ బుక్ లో ఒక అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అమ్మాయితో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కులాలు వేరైనా పెద్దల అనుమతితో గతేడాది నవంబర్లో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు.
మార్చి 10న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి అవసరాల కోసం, యువతి కోసం వైష్ణవ్ 28 లక్షలు ఖర్చు చేశాడు. ఎంగేజ్మెంట్ కు 15 లక్షల బంగారం, రెండు లక్షల విలువైన డైమండ్ రింగ్, పెళ్లి తర్వాత చిత్తూరులో విందు, ఇతర పనుల కోసం 30 లక్షలు ఖర్చు చేశారు. అయితే తాజాగా ఆ అమ్మాయి వైష్ణవ్ కు ఫోన్ చేసి ఏడు లక్షలు తీసుకురమ్మని చెప్పింది. ఐదు లక్షలు తీసుకొని వెళ్ళిన అతనికి మిగిలిన రెండు లక్షలు తీసుకురావాలని వైష్ణవ్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరు యువతి ఇంటికి వెళ్ళగా, తమ స్థాయికి తగ్గ సంబంధం కాదని పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరు షాక్ అయిపోయారు.
అంతేకాకుండా ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అందుకు ప్రతిగా పెళ్లి కొడుకు చిత్తూరులో ఫిర్యాదు చేశాడు. సదరు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వైష్ణవ్ మద్యం తాగి సంగీత్ వేడుకలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించాడని అడ్డుకున్న తనవారిపై దాడి చేసినట్లుగా తెలిపారు. దీంతో కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఉమ్మడిగా విచారిస్తున్నారు. ఇలాంటి ఉదంతాల్లో అసలైన బాధితులు అస్సలు నష్టపోకూడదు అన్నమాట వినిపిస్తుంది. ఏది ఏమైనా అతను ఆమె కోసం అన్ని కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసు పై ఇంకా తదుపరి విచారణ జరగాల్సి ఉంది.