Facebook Earn Money : ఫేస్ బుక్ ద్వారా డబ్బులు సంపాదించండి ఇలా.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Facebook Earn Money : ఫేస్ బుక్ ద్వారా డబ్బులు సంపాదించండి ఇలా.!

 Authored By aruna | The Telugu News | Updated on :12 November 2023,9:00 am

ప్రధానాంశాలు:

  •  Facebook Earn Money : ఫేస్ బుక్ ద్వారా డబ్బులు సంపాదించండి ఇలా.!

Facebook Earn Money  : ఫేస్ బుక్ కు సంబంధించి మెటా కంపెనీ ఇటీవలే ఒక కొత్త ప్రకటన చేసింది. బోనస్ లతో పాటు ప్రకటనల ద్వారా డబ్బును సంపాదించే మార్గం చూపించింది. పండుగ సందర్భంగా బోనస్లను సైతం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్ తో పాటు ఇంస్టాగ్రామ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలో చెప్పింది. మెటా ఇప్పటికే 35 దేశాలలో కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ ను ప్రారంభించింది. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్లు ప్రతినెలా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇప్పటికే ఫేస్ బుక్ ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారి కోసం అనేక అప్డేట్లను తీసుకువచ్చింది..

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఆహ్వానాలకు మాత్రమే బోనస్ ప్రకటించింది. క్రియేటర్లు తమ టాలెంట్ చూపుతూ రీల్స్, ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఈ రివార్డులను పొందవచ్చు. ఈ బోనస్ లు మొదట్లో ఎంపిక చేసిన కొందరు క్రియేటర్లకు మాత్రమే అందుతుంది. అయితే రీల్స్, వ్యూస్ ఎన్ని వచ్చాయనే ఆధారంగా బోనస్ లు లభిస్తాయి. ఇంస్టాగ్రామ్ లో చాలామంది ఫాలోవర్లు ఉంటే విభిన్నమైన, విలక్షణమైన కంటెంట్ క్రియేట్ చేయవచ్చు. దీనికి చార్జ్ కూడా చేయవచ్చు. ఇంస్టాగ్రామ్ మాదిరిగానే ఫేస్ బుక్ లో కూడా సభ్యత్వాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వందల వేల క్రియేటర్ల ఖాతాలకు దీనిని విస్తరించనున్నట్లు మెటా తెలిపింది.

అంతేకాదు అభిమానులకు 30 రోజులకు కూడా సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. ఇలా చేస్తే ప్రతి నెలా కచ్చితంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. ఒక ఫాలోవర్ మీ రీల్స్ ని ఇష్టపడితే ఇంస్టాగ్రామ్ లోనే బహుమతిని పంపవచ్చు. ఈ బహుమతులను స్టార్లుగా కూడా కొనవచ్చు లేదా ఇన్స్టా యాప్ నుంచి వర్చువల్ గిఫ్ట్ లను కూడా కొనవచ్చు. అయితే ఈ ఆప్షన్ కావాలంటే ఎకౌంట్లో కనీసం 5000 మంది ఫాలోవర్స్ ఉండాలి. క్రియేటర్ల వయసు 18 ఏళ్లకు పైగా ఉండాలి. ఇంస్టాగ్రామ్ లో స్టోరీలు పోస్ట్ చేసేటప్పుడు బూస్ట్ బ్రాండ్ పార్ట్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని క్లిక్ చేయడం ద్వారా ప్రతినెల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్ చూపకపోతే మెటా పూర్తిగా రోల్ అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. దీనికి మీరు అర్హులో కాదో చెక్ చేసి తెలుసుకోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది