RCB Victory Parade Stampede : చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకి కారణాలు ఇవే..!
ప్రధానాంశాలు:
RCB Victory Parade Stampede : చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకి కారణాలు ఇవే..!
RCB Victory Parade Stampede : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ RCB ) విజయోత్సవ సంబరాలని ప్రత్యేకంగా చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌లో 11 మంది కన్నుమూసారు. 50 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. 18 ఏళ్ల తర్వాత కప్ దక్కించుకోవడంతో ఆర్‌సీబీ ఫ్రాంచైజీ కూడా వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసింది. బెంగళూరులోని విధాన సౌద నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు ఓపెన్ బస్ పరేడ్ ఉంటుందని ప్రకటించింది. దాంతో విజేతలుగా నిలిచిన తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పోటెత్తారు…

RCB Victory Parade Stampede : చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాటకి కారణాలు ఇవే..!
RCB Victory Parade Stampede ఇదొక గుణపాఠం..
వాస్తవానికి ఆర్‌సీబీ విక్టరీ పరేడ్‌కు బెంగళూరు పోలీసులు అనుమతివ్వలేదు. కాకపోతే విజయోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం కావడంతో పోలీసులు అనుమతిచ్చినట్లు అర్థమవుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆర్‌సీబీ ఆటగాళ్లకు స్వాగతం పలికారు. విధాన సౌధ ముందు ఆర్‌సీబీ ఆటగాళ్లను కర్ణాటక సీఎం సిద్దరామయ్య సత్కరించారు.
సీఎం సిద్దరామయ్యతో పాటు ఇతర ప్రభుత్వ పెద్దలు ఈ వేడుకల్లో భాగం కావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద పోలీసుల సంఖ్య తగ్గింది. ఆ సమయంలోనే వర్షం పడటంతో ఆర్‌సీబీ ఓపెన్ బస్ పరేడ్‌ను రద్దు చేశారు. దాంతో అయోమయానికి గురైన అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తారు. 35 వేల సీటింగ్ కెపాసిటీ కలిగిన మైదానానికి 2-3 లక్షల మంది అభిమానులు వచ్చారని కర్ణాటక సీఎం సిద్దరామయ్యనే తెలిపారు. వర్షం కూడా పడటంతో అభిమానులంతా ఒకే చోటికి గూమిగూడారు. గేట్-2 వద్ద లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది.