YS Viveka Murder Case : వివేక హత్య కేసులో భారీ ట్విస్ట్.. ఏపీ రాజకీయం ముఖచిత్రం మార్పు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట.. వీడియో
2019 ఎన్నికల ప్రచారం సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తెలుగు రాజకీయాలను కుదిపేసింది. అతి కిరాతకంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ 2019 నుండి జరుగుతోంది. ఈ క్రమంలో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ వివేక కూతురు సునీత… విచారణ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసి న్యాయస్థానాలలో పోరాడి సీబీఐ చేత విచారణ చేసే దిశగా ముందడుగులు వేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కేసు విచారణకు సంబంధించి నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ కేసు..
విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇటీవల ఈ పిటిషన్ విచారణకు రావటంతో.. సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపై మండిపడింది. ఇదే సమయంలో హత్య కేసును మొదటి నుండి దర్యాప్తు చేస్తున్న అధికారిని వెంటనే మార్చాలని సిబిఐకి సూచించడం జరిగింది. వివేక హత్యలో భారీ కుట్ర ఉందని హైకోర్టు తెలియజేసింది. అయితే ఇప్పటిదాకా జరిగిన విచారణ తీరు చూస్తే కేవలం రాజకీయ కుట్ర అంటూ.. విచారణ చేసిన అధికారులు పొందుపరిచారు.
మరి నిందతులను పట్టుకోవాలంటే ఈ కారణాలు సరిపోవు. ఎంతో కుట్ర దాగి ఉందన్న ఈ కేసులో వెలికి తీయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. గనుక వెంటనే విచారణ అధికారిని మార్చాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. మరోపక్క ఈ కేసు విచారణలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సైతం సిబిఐ కూడా తప్పుదోవ పట్టించే దిశగా వ్యవహరిస్తున్నట్లు మీడియా ముందు కామెంట్లు చేశారు. ఈ క్రమంలో అటువంటి అధికారులను పక్కన పెట్టే రీతిగా సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారనుందని ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట ఇచ్చే రీతిలో అసలు నిజం బయటపడనుందని వార్తలు వస్తున్నాయి.