హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు త్రిముఖ పోటీని తలపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగింది. అయితే టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ను మళ్లీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం తామే అని.. ఈ విషయంలో బీజేపీ తమతో పోటీ పడలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ వైపు చూస్తున్న నేతలు, బీజేపీలో కొనసాగుతున్న నేతలను తమ వైపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అప్పటివరకు బీజేపీలోకి వచ్చేందుకు ముందుకొచ్చిన పలువురు నేతలు.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కాంగ్రెస్ వైపు చూడటం బీజేపీకి కొత్త సవాల్‌ను తెచ్చిపెట్టింది.ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతలు, తమ పార్టీలోకి రావాలనుకున్న నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అడ్డుకోవడంలో బీజేపీ కొంతవరకు సక్సెస్ అయ్యిందనే చర్చ జరుగుతోంది.
దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్, కూల శ్రీశైలం గౌడ్, మూల విక్రమ్ గౌడ్ వంటి కొందరు నాయకులు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సముఖత వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. బీజేపీలో కొనసాగుతున్న ఈ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళితే తమకు ఇబ్బందులు తప్పవని భావించిన కమలనాథులు.. వారు అటు వైపు వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. కొందరు ముఖ్యనేతలు రంగంలోకి దిగి వీరితో చర్చలు జరిపారు. వీరిలో కొందరు నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి మరీ.. తాము పార్టీ మారడం లేదనే సంకేతాలు ఇచ్చేలా చేశారు కాషాయం నేతలు. ఇప్పటికిప్పుడు పార్టీలోకి కొత్త నేతలు రాకపోయినా.. ఇప్పటికే పార్టీలో చేరిన నాయకులు మళ్లీ వేరే పార్టీలో మారకుండా చూడాలని బీజేపీ నేతలు భావించారు. అలా జరిగితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి ఇబ్బందులు రావడంతో పాటు తెలంగాణలో బీజేపీ బలహీనపడుతుందనే సంకేతాలు వెళతాయని అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ వైపు చూస్తారని అనుకున్న నేతలందరినీ కలిసి.. వారు బీజేపీలోనే కొనసాగేలా చేశారని సమాచారం.
ఈ రకంగా చేయడం ద్వారా తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలను ఆకర్షించకుండా చేయడంలో బీజేపీ నేతలు చాలావరకు విజయం సాధించారనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టడంతో పాటు మరో ప్రధాన రాజకీయ పార్టీ కాంగ్రెస్ బలోపేతం కాకుండా చూస్తేనే.. బీజేపీ ఇక్కడి రాజకీయాల్లో రాణించగలదని బీజేపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.జూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం లేదా టీఆర్ఎస్‌కు అక్కడ గట్టి పోటీ ఇవ్వడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే విషయాన్ని చాటి చెప్పొచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు నేతలెవరూ ఇతర పార్టీల వైపు చూడకుండా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణలో బలపడేందుకు ప్రయత్నిస్తున్న కమలనాథులు.. ఈ విషయంలో ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.