ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా ఉన్న ప్రవీణ్ బడుగుల రాజ్యాధికారం కోసం కార్యచరణ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో బీఎస్పీ పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నేపథ్యంలోనే ఈ నెల11న ఖమ్మంలో ‘బహుజన సమ్మేళనం’ నిర్వహించనున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బుర్రా ఉపేందర్ సాహు తెలిపాడు. సభ జయప్రదం చేసేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో సత్తా చాటేందుకు బీఎస్పీ సమాయత్తమవుతున్నదని బుర్రా పేర్కొన్నారు. ఇకపోతే రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం మూడు నియోజకవర్గాలు జనరల్‌గా ఉన్నాయి. ఈ క్రమంలోనే రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పట్టు సంపాదించుకునేందుకుగాను ఇప్పటి నుంచే బీఎస్పీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. జిల్లాలోని అన్ని వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రవీణ్ సభ తర్వాత జిల్లాలో బీఎస్పీ జోష్ కనబడుతుందని బీఎస్పీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు,…
Bigg Boss Telugu 8 : సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో…
Beer : ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ విషయం…
This website uses cookies.