మీకు ఎన్నికలే ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం పట్టదా కేసీఆర్ గారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మీకు ఎన్నికలే ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం పట్టదా కేసీఆర్ గారు..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :22 April 2021,7:00 am

BJP Laxman : ప్రస్తుతం తెలంగాణ వ్యాఫ్తంగా కరోనా మహమ్మారి విపరీతంగా విస్తరించింది. ఎక్కడ చూసినా కేసులే. రోజురోజుకూ కేసులు రెట్టింపు అవుతున్నాయి. బెడ్లు లేవు… ఆక్సీజన్ సిలిండర్లు నిండుకున్నాయి. ఏ ఆసుపత్రికి వెళ్లినా కరోనా పేషెంట్లతో ఫుల్ అయిపోయింది. ఈనేపథ్యంలో కరోనాను తరిమికొట్టాలంటే జాగ్రత్తలు పాటించడం తప్పితే చేసేదేం లేదు. అయితే… కరోనా పోరులో ప్రభుత్వం కూడా ప్రజలతో కలిసి పనిచేయాలి. కానీ… ప్రభుత్వం ఎన్నికల మీద చూపెడుతున్న శ్రద్ధను కరోనా వైరస్ ను తరిమికొట్టడంలో చూపించడం లేదంటూ బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు.

bjp laxman on telangana govt

bjp laxman on telangana govt

లక్ష్మణ్… తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల మీద ఉన్న సోయి వీళ్లకు ప్రజల మీద.. వాళ్ల ఆరోగ్యం మీద లేదని దుయ్యబట్టారు. ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుంటే… రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఎన్నికలకే పోతామంటోంది. ఇలా మొండిగా ప్రవర్తించి ప్రజల ఆరోగ్యంతో చెలగాడం ఆడుతున్నారా? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.

bjp laxman on telangana govt

bjp laxman on telangana govt

BJP Laxman : కరోనా పేరుతో కార్పొరేట్ ఆసుపత్రులు జనాలను దోచుకుంటున్నాయి

మీకు ఎన్నికలే ముఖ్యం కావచ్చు. కానీ… బీజేపీకి మాత్రం ఎన్నికల కంటే కరోనాను నియంత్రించడమే ముఖ్యం. ఎన్నికలు మాకు ముఖ్యం కాదు. ఎన్నికలు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం కరెక్ట్ కాదు. ప్రతి 10 మందిలో నాలుగు నుంచి ఐదుగురికి కరోనా పాజిటివ్ వస్తోంది. మీ బేషజాలను పక్కన పెట్టండి. ముందు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలను వాయిదా వేయండి. ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించండి. కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి. కృత్రిమంగా బెడ్స్ కొరతను సృష్టిస్తున్నారు. వెంటిలేటర్లు లేవు… డాక్టర్లు సరిపడా లేరు. ఆరోగ్య మంత్రి కూడా చేతులెత్తేశారు. కనీసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేకపోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అయినా తెలంగాణ కొనసాగిస్తే బెటర్… అంటూ లక్ష్మణ్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది