KCR : సీఎం కేసీఆర్ డబ్బులతో రాజకీయం చేస్తున్నారు… మహిళా నేత సంచలన వ్యాఖ్యలు?
KCR : తెలంగాణలో వరుసగా ఎన్నికల భేరీ మోగుతోంది. సాగర్ ఉపఎన్నిక పూర్తయిందో లేదో… మునిసిపల్ ఎన్నికలకు తెరలేచింది. ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నిక. దీంతో రాజకీయ పార్టీలకు అసలు టైమే దొరకడం లేదు. ఒక ఎన్నికల ప్రచారంలో పాల్గొనగానే మరో ఎన్నిక రావడం… ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం.. ఇదే పని అయిపోతోంది. తాజాగా మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీల ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రధాన పార్టీలన్నీ ఇక సాగర్ ఉపఎన్నికను వదిలేసి.. వీటి మీద పడ్డాయి. ఈ ఎన్నికల్లో కూడా ప్రధానంగా పోటీ అంటే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే.

bjp leader dk aruna on telangana cm kcr
రెండు మునిసిపిల్ కార్పొరేషన్లకు, ఐదు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండు మునిసిపల్ కార్పొరేషన్ల అయిన వరంగల్, ఖమ్మం.. ఈ రెండు కూడా ప్రధానమైన నగరాలే. అలాగే… కొత్తగా ఏర్పాటయిన ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అన్నీ సిద్ధం చేసుకుంటోంది. బీజేపీ నేతలు కూడా ఎన్నికల కోసం ప్రిపేర్ అవుతున్నారు.
KCR : తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. డీకే అరుణ
తాజాగా… బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… పురపాలక ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు.. డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈసందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని… అందుకే మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలంటూ ఆమె కోరారు.

bjp leader dk aruna on telangana cm kcr
డబ్బులతో రాజకీయం ఎలా చేయాలో సీఎం కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. ఆయన డబ్బులతో రాజకీయం చేస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అక్కడ బీజేపీ గెలుపు చూడలేకనే…. వందల కోట్లు ఖర్చు చేసి మరీ… రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నారు. చాప కింద నీరులా కరోనా విస్తరిస్తుంటే… వరుసగా ఎన్నికలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అందుకే… వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ లో బీజేపీనే ప్రజలు గెలిపించబోతున్నారు. అలాగే… ఐదు మునిసిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు… అని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.