YS Jagan : ఏపీలో బీజేపీకి ఆ సత్తా ఉందా… వైఎస్ జగన్ ను ఢీ కొట్టగలరా?
YS Jagan : ఉత్తర భారతం మొత్తం కూడా బీజేపీ జెండా దాదాపుగా పాతేశారు. కొన్ని చోట్ల సొంతం.. కొన్ని చోట్ల మిత్ర పక్షలతో కలిసి కొన్ని చోట్ల మిత్ర పక్షాలకు మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా దేశ వ్యాప్తంగా తమ సత్తా చాటేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ షా ల ద్వయం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీ జెండాలను రెడీ చేస్తోంది. సమయం దొరికితే చాలు పాతేద్దాం అన్నట్లుగా ఎదురు చూస్తోంది.
తెలంగాణలో 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్‌ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వబోతుంది. గతంలో తెలుగు రాష్ట్రంలో ఎప్పుడు చూపించని ప్రభావంను బీజేపీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో చూపించడం కన్ఫర్మ్ అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత మరియు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. దాంతో బీజేపీకి తెలంగాణలో మంచి ఛాన్స్ ఉంది అనేది చాలా మంది అభిప్రాయం. కాని ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితులు అస్సలు లేవు.
ఏపీలో కూడా తెలంగాణ లో మాదిరిగా సోము వీర్రాజు హడావుడి చేసే ప్రయత్నం చేశాడు. కాని జగన్ కు ఉన్న మద్దతు నేపథ్యంలో బీజేపీని జనాలు ఆధరించే అవకాశం కనిపించడం లేదు. ఏపీలో 2024 లో కూడా జగన్ ప్రభుత్వం రావడం కన్ఫర్మ్ అన్నట్లుగా నిర్ధారణకు వచ్చిన బీజేపీ తమ ప్రయత్నాలను వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ నాయకులు ఏపీ లో జగన్ ను ఢీ కొట్టడం అసాధ్యం అన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే ప్రస్తుతానికి ఏపీ లో జెండాలు నాటే కార్యక్రమాన్ని బీజేపీ పెట్టుకోదల్చుకోవడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.