Raja Singh : రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు.. వివాదాస్పద వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసులు జారీ
Raja Singh : బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ వర్గంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆయనపై వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. రాజాసింగ్ పై పలు సందర్భాల్లో.. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఓ వర్గంపై ఆయన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు నమోదు కావడంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకుంది.
పార్టీ నిబంధనలకు విరుద్ధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని బీజేపీ భావించింది. అందుకే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఆయన సస్పెన్షన్ పై ప్రకటన విడుదల చేసింది. పార్టీకి చెందిన పలు బాధ్యతల నుంచి రాజాసింగ్ కు వెంటనే తప్పిస్తున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
Raja Singh : వచ్చే నెల 2 లోగా వివరణ ఇవ్వాలంటూ డిమాండ్
అయితే.. పార్టీ నుంచి రాజాసింగ్ ను ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలంటూ హైకమాండ్ షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 10 రోజుల్లోగా అంటే వచ్చే నెల 2 లోగా రాజాసింగ్ సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులను బీజేపీ జారీ చేసింది. మరి.. రాజాసింగ్.. తన సస్పెన్షన్ పై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.