Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో బీజేపీ సరికొత్త రాజకీయం.?
Jr NTR : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌లో సినీ నటుడు యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో భేటీ అత్యంత కీలకమైన అంశంగా మారింది. అధికారికంగా ఈ విషయమై బీజేపీ నుంచి ప్రకటన వచ్చాక, అంతా ఆశ్చర్యపోయారు. కేవలం, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించి ఎన్టీయార్ నటనకు ముగ్ధులై అమిత్ షా, ఆయన్ని డిన్నర్ మీటింగ్‌కి ఆహ్వానించారనడం ఎంతవరకు నమ్మశక్యంగా వుంది.?
రాజకీయాల్లో అంతే.! యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో బీజేపీకి ఏదో పెద్ద అవసరమే వచ్చింది. చాలా రాజకీయ సమీకరణాల్ని వేసుకుని, చాలా చాలా లెక్కలతో యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి బీజేపీ వల విసురుతోందని ఈ విషయం ద్వారా అర్థమవుతోంది. ఇందులోకి కుల సమీకరణాల్ని కూడా తీసుకొస్తున్నారు కొందరు. యంగ్ టైగర్ ఎన్టీయార్ మాత్రం ప్రస్తుతానికి రాజకీయాలకు చాలా చాలా దూరంగా వున్నాడు. అయితే, ఆయన్ని తరచూ రాజకీయాల్లోకి లాగుతున్నది తెలుగుదేశం పార్టీనే. రాజకీయంగా ఎన్టీయార్‌ని బదనాం చేయాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు టీడీపీ చేస్తూనే వుంంది. ‘రాజకీయాలు నాకొద్దు మొర్రో..’ అని ఎన్టీయార్ చెప్పినా, అతన్ని వదిలి పెట్టడంలేదు..
ఒకప్పుడు ఇదే యంగ్ టైగర్ ఎన్టీయార్, తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల ప్రచారం చేయడమే బహుశా ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అయి వుండొచ్చు. ఎందుకంటే, సాయం చేసినోడ్ని నాశనం చేయాలన్నది టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి రాజకీయ లక్షణం.. అంటారు కొందరు. సరే, యంగ్ టైగర్ ఎన్టీయార్.. బీజేపీ రాజకీయాల వైపు ఆకర్షితుడవుతారా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. డిన్నర్ మీటింగ్‌కి మర్యాదపూర్వకంగా పిలిచారు గనుక, యంగ్ టైగర్ ఎన్టీయార్ వెల్లడంలో వింతేమీ లేదు. కాకపోతే, ఆయన ఈ విషయమై సమాధానం చెప్పుకోవాల్సి రావొచ్చు. ఆయన ఏం చెబుతాడన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే.