BJP Party : డిపాజిట్ కూడా దక్కని బీజేపీ పార్టీ !
BJP Party : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఏడు వైసీపీ గెలుచుకోగా రెండు టీడీపీ గెలవడం జరిగింది. అయితే ఎక్కడా కూడా బీజేపీ రాణించలేకపోయింది. కానీ గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో 2017లో బీజేపీ నేత పీవీయన్ మాధవ్ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మాధవ్ పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు ఆశీస్సుల మేరకు..బీజేపీ సత్తా చాటడం జరిగింది.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే జరిగిన పట్టా బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మిత్రపక్షంగా ఉన్న జనసేన బీజేపీ…నీ గెలిపించాలని ఒక ప్రకటన కూడా చేయలేదు. కేవలం వైసీపీ గెలవకూడదు అనే ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. మరోపక్క జనసేన మద్దతు తమకు ఉందని పట్టాభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో…బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంత ప్రచారం చేసినా … జనసేన నుండి ఎటువంటి సౌండ్ రాలేదు. పొత్తు ఉన్నాగాని రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉందని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరోసారి డొల్లతనం బయటపడింది. కానీ ఏ పొత్తు లేకపోయినా జనసేన నుంచి టీడీపీ అభ్యర్థికి ఓట్లు బాగా పడ్డాయి అన్న ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఏపీలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో…
బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉన్న క్రమంలో బీజేపీ పరిస్థితి చూస్తే ఆటలో అరటిపండు అన్నట్టు మారిపోయింది. మరోపక్క తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. టీడీపీ పార్టీకి చెందిన కీలక నాయకులు ఢిల్లీలో కమల పెద్దలతో పొత్తు విషయంలో ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి జరిగే ఎన్నికలలో టీడీపీ ఓడిపోతే ఇంకా ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని అప్పుడు బిజెపికి భవిష్యత్తు ఉంటుందని కమలనాధులు భావిస్తున్నట్లు టాక్. అందుకే ఈ జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో తటస్థంగా ఉండాలని అనుకుంటున్నాట్లు పొలిటికల్ సర్కిల్స్ లలో వినికిడి.