BJP – TRS : టీఆర్ఎస్‌ కి సూపర్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న బీజేపీ.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BJP – TRS : టీఆర్ఎస్‌ కి సూపర్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న బీజేపీ.!

BJP – TRS : ఏడాదిలో అధికారాన్ని ఏర్పాటు చేస్తామంటోంది తెలంగాణ బీజేపీ. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించగా, ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలూ హాజరయ్యారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు మామూలే […]

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2022,10:00 pm

BJP – TRS : ఏడాదిలో అధికారాన్ని ఏర్పాటు చేస్తామంటోంది తెలంగాణ బీజేపీ. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బల్లగుద్ది మరీ చెప్పేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించగా, ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి సహా పలువురు తెలంగాణ బీజేపీ నేతలూ హాజరయ్యారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో రాజకీయ విమర్శలు మామూలే కదా.! కానీ, కాస్త ఘాటుగా, ఒకింత సంచలనంగా వున్నాయి గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలు.

కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ లోపం వుందనీ, ఆ ప్రాజెక్టుని కేసీయార్ ఏటీఎంలా వాడుకున్నారనీ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. డిజైన్ లోపం వున్న ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎలా ఇస్తాం.? అంటూ ఆయన ప్రశ్నించడం గమనార్హం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌కి దళితులన్నా, గిరిజనులన్నా చిన్నచూపు అనీ, దళితుడ్ని తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీయార్ మాట తప్పారనీ, గిరిజన అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తే మద్దతివ్వలేదనీ గజేంద్ర సింగ్ షెకావత్ మండిపడ్డారు. మరోపక్క, ఇంకో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే, తెలంగాణలో కేసీయార్‌ని గద్దె దించే దాకా తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

BJP To Give Super Shock To TRS Soon

BJP To Give Super Shock To TRS Soon?

ఏడాదిలో తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చి తీరుతుందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీయార్, కేంద్రానికి సహకరించడంలేదనీ, సహకరిస్తే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోయేదనీ, చాలా ప్రాజెక్టులు పూర్తయ్యేవనీ కిషన్ రెడ్డి చెప్పారు. కాగా, వచ్చే ఏడాది చివర్లో షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాలి. ఒకవేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ముందస్తుకి వెళ్ళాలనుకుంటే, ఏ క్షణాన అయినా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సర్వసన్నద్ధంగానే వున్నట్లు కనిపిస్తోంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది