Brahmamudi Today Episode: మంత్రికి వార్నింగ్ ఇచ్చిన కావ్య.. నిజం ఒప్పుకున్న ధర్మేంద్ర.. 15 రోజుల డెడ్‌లైన్
ప్రధానాంశాలు:
Brahmamudi Today Episode: మంత్రికి వార్నింగ్ ఇచ్చిన కావ్య.. నిజం ఒప్పుకున్న ధర్మేంద్ర.. 15 రోజుల డెడ్‌లైన్
Brahmamudi Today Episode: బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేసేలా సాగింది. కావ్య–ధర్మేంద్ర ట్రాక్‌లో కీలక మలుపులు చోటు చేసుకోగా మరోవైపు రేఖ–రాజ్ ఎపిసోడ్‌కు అదనపు డ్రామా జతచేశారు. నిజం దాచేందుకు ధర్మేంద్ర పడే తంటాలు, తన బిడ్డ కోసం కావ్య చేసే పోరాటం ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.
Brahmamudi Today Episode: మంత్రికి వార్నింగ్ ఇచ్చిన కావ్య.. నిజం ఒప్పుకున్న ధర్మేంద్ర.. 15 రోజుల డెడ్‌లైన్
గుడిలో మొదలైన అనుమానాలు.. ధర్మేంద్రలో టెన్షన్
బుధవారం (జనవరి 28) ప్రసారమైన ఎపిసోడ్‌లో గుడిలో తులసి దగ్గర ఉన్న బిడ్డ ఏడుస్తూనే ఉంటుంది. అది చూసిన కావ్య దగ్గరకు వెళ్లి జోల పాట పాడుతుంది. ఆశ్చర్యకరంగా ఆ పాట విన్న వెంటనే పాప ఏడుపు ఆగిపోతుంది. ఈ దృశ్యం కావ్యలోని అమ్మతనాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అదే సమయంలో ఈ సన్నివేశం ధర్మేంద్రలో భయాన్ని పెంచుతుంది. కావ్య అక్కడికి ఎలా వచ్చిందని రుద్రాణిని ప్రశ్నిస్తాడు. అయితే రుద్రాణి మాత్రం అనుకోకుండా వచ్చి ఉండొచ్చని అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాధానం ఇస్తుంది. ఇటు తులసి, కావ్య చేసిన పనిని మెచ్చుకుంటుంది. ఆ సమయంలో కావ్య తన జీవితంలోని పెద్ద బాధను తులసితో పంచుకుంటుంది. తనకు బిడ్డ పుట్టినా తన దగ్గర ఉన్న బిడ్డ తనది కాదని ఎవరో మార్చేశారని చెబుతుంది. దీనికి స్పందించిన తులసి తన భర్త మంత్రి అని అతనికి చెబితే సాయం చేస్తాడని అంటుంది. ఈ మాటలు ధర్మేంద్రను మరింత కలవరపెడతాయి.
Brahmamudi Today Episode: పాపను గుర్తించిన కావ్య.. అడ్డుపడ్డ రుద్రాణి
ధర్మేంద్ర పరిస్థితిని చక్కదిద్దేందుకు తన పీఏని కలవమని చెప్పి తులసి–బిడ్డను అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ కావ్య అడ్డుపడి తులసి చీరకు పసుపు, కుంకుమ అంటిందని చెబుతుంది. ఆ సమయంలో బిడ్డను కావ్య చేతుల్లో ఇస్తారు. బిడ్డను ఎత్తుకున్న క్షణంలో కావ్యకు తన పాపనే ఎత్తుకున్న భావన కలుగుతుంది. అంతేకాదు పాప చేతిపై ఉన్న పుట్టుమచ్చను గమనించి ఆమెకు అనుమానం మరింత బలపడుతుంది. ఇది గమనించిన ధర్మేంద్ర బలవంతంగా బిడ్డను కావ్య చేతుల్లో నుంచి లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కావ్య అతని వెంట పడుతుండగా రుద్రాణి కావాలనే అడ్డుపడి పరిస్థితిని గందరగోళంగా మారుస్తుంది. ఈ సన్నివేశాలు ఎపిసోడ్‌కు హై వోల్టేజ్ టెన్షన్‌ను తీసుకొచ్చాయి.
Brahmamudi Today Episode: హాస్పిటల్‌లో బయటపడిన నిజం.. మంత్రి ఇంట్లో షాకింగ్ సీన్
ఇటు కావ్యకు డాక్టర్ నుంచి ఫోన్ రావడంతో అసలు నిజం వెలుగులోకి వస్తుంది. డెలివరీ అయినవారి లిస్ట్ చూసిన కావ్యకు తులసి పేరు కనిపిస్తుంది. ఆమె మంత్రి భార్య అని తెలిసి కావ్య అనుమానం నిజమవుతుంది. ఆ రోజు తులసికి డెలివరీ చేసిన డాక్టర్ చక్రవర్తి అప్పటి నుంచి హాస్పిటల్‌కు రాలేదని తెలిసి మొత్తం కుట్ర కావ్యకు అర్థమవుతుంది. ఆధారాలతో కూడిన ఫైల్ తీసుకుని కావ్య నేరుగా మంత్రి ధర్మేంద్ర ఇంటికి వెళ్తుంది. ఫైల్‌ను అతని ముఖాన కొట్టి తన బిడ్డను తనకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ధర్మేంద్ర నిజాన్ని ఒప్పుకున్నా పాపను ఇవ్వనని చెప్పడం మరో ట్విస్ట్. దీనికి కావ్య ఘాటుగా వార్నింగ్ ఇస్తుంది. 15 రోజుల్లోగా తన పాపను తన దగ్గరికి తెచ్చుకుంటానని తేల్చి చెబుతుంది. ఈ ఉత్కంఠభరిత ముగింపుతో బ్రహ్మముడి 941వ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.