Bread Omelette | బ్రెడ్ ఆమ్లెట్ ప్రతిరోజూ తినడం మంచిదేనా .. నిపుణుల హెచ్చరిక
Bread Omelette | రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి. ఉదయం తీసుకునే ఆహారం మన శరీరానికి శక్తిని అందించడంతో పాటు రోజువారీ పనులకు ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. ఈ బిజీ లైఫ్‌లో చాలా మంది త్వరగా తయారయ్యే బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ లాంటి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకుంటున్నారు. కానీ, వీటిని రోజూ తినడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదో తెలుసుకోవాలి.
#image_title
ఎలాంటి నష్టమంటే..
నిపుణుల ప్రకారం, బ్రెడ్ ఆమ్లెట్‌లో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ B12, D వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల పునరుద్ధరణకు, చర్మం, జుట్టు, గోర్ల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అయితే ఇవి ఇచ్చే ప్రయోజనాలు వాటిని ఎలా వండుతామో, ఏ రకమైన బ్రెడ్ వాడుతామో దానిపై ఆధారపడి ఉంటాయి.
వారానికి రెండు లేదా మూడు సార్లు గుడ్లు తినడం సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. కానీ కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు అధికంగా గుడ్లు తినకూడదు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం, వారానికి ఏడుకి మించిన గుడ్లు తినే వారిలో కూడా హార్ట్ డిసీజ్ ప్రమాదం పెరుగుతోందని తేలింది. నిపుణులు చెబుతున్నదేమిటంటే, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ వాడితే ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ పిండితో చేసిన వైట్ బ్రెడ్‌లో ఫైబర్ ఉండదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. అలాగే ఆమ్లెట్ వండేటప్పుడు ఎక్కువ నూనె లేదా వెన్న వాడితే ఆ అల్పాహారం ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.