Andhra Pradesh : బ్రేకింగ్.. ఆంధ్ర ప్రదేశ్ లో సరికొత్త జిల్లాలు !
Andhra Pradesh : 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మిగిలి ఉంది. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇటీవల 13 జిల్లాల ఏపీని 26 జిల్లాలుగా మార్చడం తెలిసిందే. అదనంగా 13 జిల్లాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త జిల్లా ఏర్పడే అవకాశం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనకు అనువుగా మరో జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. గిరిజనులకు పాలన అందుబాటులో ఉండేందుకు సీఎం జగన్ అరకు పార్లమెంటరీను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది.
అయితే త్వరలో మూడో జిల్లా కూడా ఏర్పడే అవకాశం ఉందని… దీనిపై సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి ఏడాది కావటంతో ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లా కి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని తెలియజేశారు. జిల్లాలో నూతన కలెక్టరేట్ మరియు వైద్య కళాశాల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. వైద్య కళాశాల నిర్మాణం
నిమిత్తం 600 కోట్ల రూపాయలు మంజూరైనట్లు త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం కింద 21,353 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అందువల్లే రాష్ట్రవ్యాప్తంగా 306 రైతు బరోస కేంద్రాల ద్వారా వేల మంది రైతులకు విత్తనాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే రైతు భరోసా ద్వారా 1.34 లక్షల మంది రైతులకు రూ.185 కోట్లు చెల్లించామన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధికి కొంత సమయం పడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర వ్యాఖ్యానించారు.