CM KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్.. సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ ఇస్తున్నారా..?
CM KCR : తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారింది. అయితే.. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇంకో సంవత్సరంలో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. అందుకే ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతు న్నాయి. అయితే.. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఏదో అసమ్మతి రగులుతున్నట్టు అనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే.. అధిష్ఠానంపై కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఏంటి పరిస్థితి
అనేది సస్పెన్స్ గా మారింది.నిజానికి.. బీఆర్ఎస్ పార్టీలో ఇదివరకు అంతగా అసంతృప్తులు ఏమీ లేవు. అసమ్మతి నేతలు కూడా ఎక్కువగా ఇన్ని రోజులు కనిపించలేదు. ఏదో ఒకరిద్దరు నేతలు పార్టీని వీడటం, పలు విమర్శలు చేయడం తప్పితే పెద్దగా పార్టీకి వచ్చిన నష్టం కూడా ఏం లేదు. అయితే.. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం.. బీఆర్ఎస్ పార్టీలో ఏదో ముసలం పుట్టిందని అంటున్నారు. ఓవైపు తెలంగాణలో ఈడీ దర్యాప్తులు వేగవంతం అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ కేసు కూడా తెలంగాణ మెడకు చుట్టుకుంది. దీంతో తమకు
CM KCR : ఈడీ, లిక్కర్ కేసు వల్లనే ఎమ్మెల్యేలు జంకుతున్నారా?
ఎప్పుడు ఎటువైపు నుంచి నోటీసులు వస్తాయో అని తెగ టెన్షన్ పడుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు. ఇప్పటికే పలువురు మంత్రులపై ఐటీ అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఎమ్మెల్యేకు కూడా ఈడీ నుంచి పిలుపు వచ్చింది. అందుకే కొందరు ఎమ్మెల్యేలు తమకు ఎప్పుడు నోటీసులు వస్తాయో అని టెన్షన్ పడుతున్నారట. అందుకే కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారట. వీళ్లంతా అధిష్టానంపై తిరుగుబాటు చేస్తారా? లేదా? అనేది తెలియనప్పటికీ.. ఇలాంటి ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎలా తనవైపునకు తిప్పుకుంటారో వేచి చూడాల్సిందే.