Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇలా చేయడం మంచి నిర్ణ‌య‌మే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇలా చేయడం మంచి నిర్ణ‌య‌మే..!

Revanth Reddy  : తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ పార్టీపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం అన్నది మామూలుగా జరగదు. అసాధారణ పరిస్థితిలో మాత్రమే ఈ యాక్ట్ ను గుర్తించిన బాధ్యులపై ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులో వేలకోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి పదేపదే అంటున్నారు. వేలకోట్ల రూపాయల […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2024,9:10 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇలా చేయడం మంచి నిర్ణ‌య‌మే..!

Revanth Reddy  : తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై జరిగిన భారీ అవినీతికి బీఆర్ఎస్ పార్టీపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై చర్చలు మొదలయ్యాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం అన్నది మామూలుగా జరగదు. అసాధారణ పరిస్థితిలో మాత్రమే ఈ యాక్ట్ ను గుర్తించిన బాధ్యులపై ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అయితే ఇరిగేషన్ ప్రాజెక్టులో వేలకోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని రేవంత్ రెడ్డి పదేపదే అంటున్నారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసుకోవడం ఒక ఎత్తు అయితే ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించి వృధాగా కోట్ల రూపాయలు తేలుతుంది. దీనిపైన రేవంత్ సర్కార్ మండిపడుతుంది. అయితే ఎవరిపైనా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగిస్తారు అన్నది అర్థం కావటం లేదు. ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంతా కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగిందని అధికారులు చెప్పారు.

ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేసినట్లు గొప్పగా ప్రకటించుకున్నారు. ఇంజనీర్లు ఆర్కిటెక్ట్స్ చేయాల్సిన పనిని కేసీఆర్ ఎలాగ చేశారా అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు అడిగినా కేసీఆర్ సమాధానం ఇవ్వలేదు. పదేళ్లు పాలించి బీఆర్ఎస్ తప్పుకోగానే అప్పట్లో జరిగిన అవినీతి మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ బయటపెడుతుంది. మేడిగడ్డ బ్యారేజీలో నాసిరకం నిర్మాణం రీ డిజైనింగ్ చేయడం ద్వారా వేలకోట్ల రూపాయలు వృధా అయిన కాళేశ్వరం ప్రాజెక్టు టార్గెట్ రీచ్ అవ్వలేదని ప్రభుత్వం చెబుతోంది. 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు లక్ష ఎకరాలకు కూడా నీటిని అందించలేక పోయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రాజెక్టుపై 98 వేల కోట్లు ఖర్చు అయినట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది.

అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కనీసం దానివల్ల లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తేలింది. ప్రాజెక్టు వ్యయం పెరిగిపోవడం, సాగునీటి ఆయకట్టుకు నీరు అందకపోవడం మేడిగడ్డ బ్యారేజీలో నాసిరకం నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని బాధ్యులను చేయాలి. కేసిఆర్ మొత్తానికి బాధ్యుడు అంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే తేల్చేశారు. కానీ ప్రకటన కార్యరూపంలో వచ్చేటప్పటికి రేవంత్ సర్కార్ తనపైన కక్ష సాధింపులకు దిగుతున్నారని కేసీఆర్ రోడ్డు ఎక్కుతారు. బీఆర్ఎస్ నేతలంతా గోల గోల చేస్తారు. అధికారుల పైన యాక్షన్ తీసుకోవాలంటే మొత్తం కేసీఆర్ చేసినప్పుడు తమ పైన యాక్షన్ ఎలా తీసుకుంటారని కోర్టుకి ఎక్కుతారు. అందుకని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగం సాధ్యమేనా అనే చర్చ పెరిగిపోతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది