Anantapur : ఎవరికి అర్థం కాని వింతైన గొడవ.. రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టిన దున్నపోతు..!!
Anantapur : సాధారణంగా డబ్బు కోసం లేదా అమ్మాయి కోసం ఎక్కువగా గొడవలు జరుగుతాయి. ఈ క్రమంలో కులాలకు ఇంకా గ్రామాలకు మధ్య లేదా కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకుంటాయి. కానీ అనంతపురం జిల్లాలో ఒక వింతైన ఎవరికి అర్థం కాని గొడవ చోటుచేసుకుంది. ఒక దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య పెద్ద వివాదం రాజుకుంది. కాస్త ఎటకారంగా ఉన్నా గాని అనంతపురం జిల్లాలో ఈ గొడవ ఇప్పుడు పెద్ద చర్చనీయాంసంగా మారింది. మేటర్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా కనేకల్లు మండలం అంబాపురం, రచ్చుమర్రి అనే రెండు గ్రామాలు ఉన్నాయి. అయితే ఎక్కడ పదేళ్లకోసారి ఓరి దేవర జరపటం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ తర్వాత నెలకు అమ్మవారి పేరున ఓ మూడు నెలల వయసున్న దున్నపోతును కొనుగోలు చేసి వదులుతుంటారు.
అయితే ఈ రెండు గ్రామాలలో 10ఏళ్ళ క్రితం ఊరిదేవర ముగిసిన తర్వాత మళ్లీ దున్నపోతును అమ్మవారి పేరున వదిలేశారు. దీంతో ఇప్పుడు మళ్లీ రెండు గ్రామాల్లో ఊరిదేవరకు స్థానికులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 12న అంబాపురంలో ఆ తర్వాత రచిమర్రిలో ఊరిదేవర చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అమ్మవారి పేరుతో వదిలిన దేవర దున్నపోతు కోసం అంబాపురంలో నెల రోజులు గాలించి చివర కొరకు బొమ్మనహాల్ మండలం కొలగన్న హళ్లిలో.. కనిపించిన దున్నపోతును తీసుకెళ్లి బందుల దొడ్డిలో బంధించారు. ఈ విషయం తెలియడంతో బొమ్మనహాల్ కి చెందిన స్థానికులు పెద్ద ఎత్తున ఆ దున్నపోతు తమద్దని గొడవకు దిగారు. ఇటు తమదేనంటూ అంబాపురం వాసులు నచ్చచెప్పడంతో వెళ్లిపోయారు. ఇంతలో రచ్చుమర్రికు చెందినవాళ్లు ఆ దున్నపోతు తమదని గొడవకు దిగారు.
తాము వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ అంబాపురం పెద్దలతో గొడవపడ్డారు. వారం రోజులుగా ఇరు గ్రామాల మధ్య ఈ వివాదం నడుస్తోంది. రెండు గ్రామాల మధ్య పెద్దలు పంచాయితీ పెట్టినా రాజీ కుదరలేదు. ఈ పరిణామంతో అంబాపురం పెద్దలు తాము వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారు అంటూ గొడవకు దిగారు. వారం రోజుల నుండి ఈ విషయానికి సంబంధించి రెండు గ్రామాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ పరిణామంతో రెండు గ్రామాల పెద్దలు పంచాయతీ పెట్టుకున్నారు. ఊరిదేవర నిర్వహించేందుకు సిద్ధమైన సమయంలో గొడవ సరైనది కాదని అంబాపురం వాసులు కాస్త మెత్త పడటం జరిగింది. ఈ పరిణామంతో దున్నపోతును వదులుకుంటే రెండు
నెలల లోపు తమ గ్రామంలో ఊరిదేవరా ఎలా జరుపుకోవాలి అంటూ… మరోపక్క రచ్చుమర్రి వాసులు గొడవ స్టార్ట్ చేశారు. దీంతో పోతును వదులుకునేందుకు ఇరు గ్రామస్తులు ఓకే చెప్పకపోవడంతో గొడవ నడుస్తుంది. చివరఖరికి ఈ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. గ్రామ పెద్దలను ఒక తాటిపైకి తీసుకురావడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ క్రమంలో అంబాపురంలో రేయింబగలు దున్నపోతుకీ యువకులు కాపలాగా ఉన్నారు. మొత్తం మీద ఈ దున్నపోతు వ్యవహారం చుట్టుప్రక్కల గ్రామాల్లో టెన్షన్ వాతావరణం సృష్టించింది. ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో ఈ గొడవకు ఎలా ఫుల్ స్టాప్ పడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.