Rachin Ravindra : తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన రచిన్ రవీంద్ర ఎవరు? ఈ న్యూజిలాండ్ క్రికెటర్‌కు, అనంతపురంతో లింక్ ఏంటి?
Rachin Ravindra : ప్రస్తుతం ప్రపంచమంతా ఒక్క క్రికెటర్ గురించే మాట్లాడుకుంటోంది. అతడే రచిన్ రవీంద్ర. మన టీమిండియా ఆటగాడు కాదు. న్యూజిలాండ్ క్రికెటర్. వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో అదరగొట్టేశాడు. సెంచరీ చేసి రచ్చ రచ్చ చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన ఇంగ్లండ్ ను మట్టికరిపించాడు ఈ క్రికెటర్. తన తొలి వన్డే ప్రపంచకప్ లో అది కూడా ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసి ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు రచిన్ రవీంద్ర. అసలు.. ఇంతకీ ఈ రచిన్ రవీంద్ర ఎవరు.. ఇతడికీ, ఇండియాకు ఉన్న సంబంధం ఏంటి.. అనంతపురంతో ఈయనకు ఉన్న లింకేంటి అనేది తెలుసుకుందాం రండి. నిజానికి రచిన్ రవీంద్ర భారత సంతతికి చెందిన వ్యక్తే. కాకపోతే.. న్యూజిలాండ్ లో సెటిల్ అవ్వడం వల్ల అక్కడ న్యూజిలాంట్ టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. రచిన్ రవీంద్ర తల్లిదండ్రులది ఇండియాలోని కర్ణాటక రాష్ట్రం. బెంగళూరులో వాళ్లు ఉండేవారు. ఆయన తల్లిదండ్రులు 1990 లోనే న్యూజిలాండ్ కు వలస వెళ్లారు. అక్కడే సెటిల్ అయ్యారు. రచిన్ కూడా అక్కడే పుట్టాడు.
కాకపోతే రచిన్ క్రికెట్ నేర్చుకున్నది మాత్రం భారత్ లోనే. అది కూడా మన తెలుగు రాష్ట్రం అయిన ఏపీలో. ఏపీలోని అనంతపురంలో ఉన్న రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ లోనే రచిన్ క్రికెట్ నేర్చుకున్నాడు. రచిన్ తండ్రి కృష్ణమూర్తి హాట్ హాక్స్ క్లబ్ ను స్థాపించాడు. అందుకే అనంతపురం వచ్చినప్పుడల్లా హాట్ హాక్స్ క్లబ్ తరుపున రచిన్ క్రికెట్ ఆడేవాడు. తన తండ్రి కృష్ణమూర్తికి కూడా క్రికెట్ అంటే ప్రాణం. అందుకే తన కొడుకును కూడా క్రికెటర్ ను చేశాడు. అంతే కాదు.. తన కొడుకుకు క్రికెటర్ల పేరు కలిసేలా పేరు పెట్టాడు కృష్ణమూర్తి. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్ అంటే కృష్ణమూర్తికి చాలా ఇష్టం. అందుకే వాళ్లిద్దరి పేర్లు కలిసేలా.. రాహుల్ ద్రవిడ్ లో తొలి అక్షరం రా, సచిన్ లో చివరి రెండు అక్షన్ చిన్ తీసుకొని రచిన్ అని పేరు పెట్టాడు కృష్ణ మూర్తి. అలాగే.. రచిన్ రవీంద్రకు కూడా సచిన్ టెండుల్కర్ అంటే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Rachin Ravindra : రచిన్ న్యూజిలాండ్ టీమ్ లో ఎప్పుడు చేరాడు?
న్యూజిలాంట్ టీమ్ లో సెలెక్ట్ అయిన రచిన్.. భారత్ తో జరిగిన మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. రచిన్ ఇప్పటి వరకు 18 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 13 వన్డే మ్యాచ్ లు ఆడాడు. ఇప్పటి వరకు రచిన్ 26 వికెట్లు తీశాడు. ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. కానీ.. వన్డే ప్రపంచకప్ లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు రచిన్. 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులు కొట్టి 123 రన్స్ చేసిన నాటౌట్ గా నిలిచాడు.
Rachin Ravindra talking about the story behind his name, his idol and his favourites in cricket.
A great interview! pic.twitter.com/2jx9hrEuae
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023